చిత్తూరు

పఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 31 : జిల్లాలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు వాహనాలతో పాటు 4.6 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లాఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన చిత్తూరులో విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో దాడులు నిర్వహించి హజి, చక్రవర్తి అనే ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో టాస్క్ఫోర్స్ బృందాలు ముమ్మర దాడులు చేసి తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి వద్ద నిల్వ ఉంచిన ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డంప్‌లో 4.6 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు చెప్పారు. అలాగే ఈ టాస్క్ఫోర్స్ దాడిలో తాళంబేడు క్రాస్ ప్రాంతంలో వాహనాల తనిఖీలో ఎర్రచందనం స్మగ్లర్లుగా చలామణి అవుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన కృష్ణమూర్తి, జాఖీర్‌హుస్సేన్, సెల్వరాజ్, వినోద్‌కుమార్‌లతో పాటు చిత్తూరు జిల్లా పీలేరు బోయపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇందులో తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి, కాఖీర్‌హుస్సేన్ గత ఐదేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిపారు. వీరిపై తమిళనాడుతో పాటు చిత్తూరు జిల్లాలో అనేక కేసులు నమోదైనట్లు వివరించారు. తమిళనాడుకు చెందిన వినోద్‌కుమార్ ఎంబిఎ చదువుకుంటూ స్మగ్లర్లకు దుంగలను తరలించేవాడని ఎస్పీ తెలిపారు. వీరిచ్చిన సమాచారం మేరకు మరికొంత మంది స్మగ్లర్లకు కూలీలను సరఫరా చేసేవారి వివరాలను కూడా సేకరించామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సంవత్సరం ఇంతవరకు 31 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 75 వాహనాలను సీజ్ చేసి 243 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఎఎస్పీ రత్న, డిఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.