చిత్తూరు

కార్మికుల సెజ్ నిధులను తరలిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 31: బల్డింగ్ కార్మికుల కోసం నిర్దేశించబడిన 12,500 కోట్లను చంద్రన్న బీమా పథకానికి వినియోగిస్తే సహించేదిలేదని ఎ ఐ టియుసి జిల్లా అధ్యక్షుడు మురళి హెచ్చరించారు. ఆదివారం ఎ ఐ టి యుసి నగర సమితి ఆధ్వర్యంలో సెజ్ నిధులను చంద్రన్న బీమా పథకానికి తరలించడాన్ని బస్టాండు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకం ద్వారా రాష్ట్రంలో 1కోటి 50లక్షల మంది బిల్డింగ్‌కార్మికులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇందుకు తాము కూడా స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆ పథకానికి ప్రత్యేకంగా 10వేల కోట్లు రూపాయలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేతప్ప సెజ్ నిధులను బదలాయింపు చేస్తే చూస్తూకోమన్నారు. 1996 ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఇంద్రజిత్‌గుప్తా హోమ్ మినిస్టర్ కేంద్రంలో ఉన్నపుడు ఆరోజు బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2009 వరకు రాష్ట్రంలో ఈ కార్మికుల సంక్షేమ బోర్డుకొనసాగిందన్నారు. అయితే ఈ విషయం కార్మికులకు తెలియదని, వారికి అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. నాటి నుంచి నేటి వరకు బిల్డింగ్ కార్మికుల కోసం యాజమాన్యం ద్వారా సెజ్ వసూలుచేశారన్నారు.
దీని ద్వారా 12,500 కోట్ల రూపాయల నిధులు సమకూరాయన్నారు. కార్మికులకు ఏదైనాప్రమాదం జరిగితే సంక్షేమబోర్డు ద్వారా ఆ నిధులు కార్మికులకే ఉపయోగించుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నిధులను చంద్రబాబునాయుడు తన పేరుమీదున్న పథకానికి బదలాయించాలని చూడటం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ కార్మికులు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ లేబర్ కార్యాలయం వద్ద ధర్నాచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మాటను వెనుక్కుతీసుకోకపోతే ఆందోళన ఉధృతంచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమలం ఎ ఐ టి యుసి నాయకులు ఎన్ డి రవి,రాధాకృష్ణ, ఎన్.శ్రీరాములు, కె.వై రాజ, శివ, జగన్నాధం,రామకృష్ణ, సూరి, రవి, ఆనంద, భాస్కర్, భాష పాల్గొన్నారు.