చిత్తూరు

వర్షాలకు దెబ్బతిన్న టమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 31: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పడమటి ప్రాంతంలోని టమోటా సాగు పూర్తిగా దెబ్బతిన్నది. వరుణుడు రైతుల్లో ఆశలు రేకెత్తించినా ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, టమోటా, వరిసాగు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పడమటి కరవు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ దిగుబడులు ఇస్తున్న జిల్లా టమోటాలకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, గోవా ప్రాంతాల్లో డిమాండ్ కలిసొస్తోంది. మదనపల్లె టమోటా వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఇటీవల ఎగుమతుల విస్తరణతో పాటు దిగుబడి సైతం పెరిగింది. రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, బాపట్ల, వరంగల్, కరీంనగర్, గుంటూరు, ఆదోని తదితర ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతోంది. తమిళనాడు వ్యాపారులు ఇక్కడ టమోటా కొనుగోలు చేసి ఎగుమతి చేసుకునే వారు. అయితే ఈ ఏడాది చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కేరళ, రాష్ట్రాలతో పాటు గోవాకు ఎగుమతులు విస్తరించాయి. వర్షాలు పడకముందు కిలో 25 నుంచి 30 రూపాయల వరకు పలికింది. వర్షాలతో కాయలకు మచ్చతెగుళ్లు సోకడంతో కిలో 18 రూపాయలు పలుకుతోంది. పొరుగు రాష్ట్రాల్లో టమోటాసాగు లేకపోవడం జిల్లా రైతులకు కలిసొచ్చింది. ఎన్నడూ చూడని ధరలపై దేవుడు కరుణించాడంటూ రైతులు సంతోషంలో ఉండగా, మహారాష్ట్ర టమోటాలను ఇక్కడికి దిగుమతులు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో మార్కెట్ యార్డుకు స్థానిక వ్యాపారులతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు టమోటాలు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో వర్షాలకు నష్టపోయిన టమోటా రైతులు ఉన్న కాయలు అమ్ముకుని అప్పులు తీర్చుకుందామని భావించారు. అయితే మహారాష్ట్ర టమోటాతో ధరలు తగ్గిపోవడంతో రైతులు మార్కెటింగ్ అధికారులపై మండిపడుతున్నా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులైనా స్పందించి టమోటామార్కెట్‌కు రెగ్యులర్ సెక్రటరీని నియమించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.