చిత్తూరు

3కోట్ల విలువైన వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 9: వాహనంతో పాటు రూ.3 కోట్లు విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 20 మంది పరారు కాగా ఒక్కరిని అరెస్ట్‌చేసినట్లు టాస్క్ఫోర్స్ డి ఎస్పీ రవికుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ డి ఎస్పీ మాట్లాడుతూ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం 2 గంటలకు రేణిగుంట- ఏర్పేడు పోలీసులు సంయుక్తంగా కలిసి మామండూరు, శెట్టిపల్లి మధ్యలోని అటవీప్రాంతం వద్ద ఉన్న రైల్వేట్రాక్ సమీపంలో ఎర్రచందనం దుంగలు రవాణాకు సిద్ధంగా ఉన్న వారిపై దాడిచేయగా సంఘటనా స్థలం నుంచి 20 మంది ఎర్రకూలీలు పరారుకాగా ఒక బాలుడ్ని అరెస్ట్‌చేయగా సంఘటనా స్థలం నుంచి రెండున్నర టన్ను ఎర్రచందనం దుంగలను, వాహనంను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని కోర్టుకు రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం 88 ఎర్రచందనం దుంగలు వాహనంతో పాటు 3కోట్లు విలువ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏర్పేడు ఎస్ ఐ రామకృష్ణ, రేణిగుంట ఎస్ ఐ మధుసూదన్‌రావు, రైటర్ సుబ్బు తదితర సిబ్బంది పాల్గొన్నారు.