చిత్తూరు

రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 3: రాష్ట్భ్రావృద్ధి పట్ల కేంద్రం సానుకూలంగా ఉందని రాష్టమ్రంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరులో విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయలన్న దిశగా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర రాజధాని శంఖుస్థాపన రోజునే ఐదు విశ్వవిద్యాలయాలను మంజూరు చేసి, పలు సంక్షేమ కార్యక్రమాల కోసం సుమారు 1300 కోట్ల రూపాయలు కేటాయించి ఏపి పట్ల తన విశ్వాసాన్ని కేంద్రం చాటుకుందన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా కాంగ్రెస్, వామపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని శక్తులకు ఈ పార్టీలు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో సైతం కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టడం కాంగ్రెస్, వామపక్షాలకే చెల్లిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో సైతం ఈ పార్టీలు తమ స్వలాభం కోసం కలుషితం చేస్తున్నాయన్నారు. దేశ విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి బిజెపి ఆధ్వర్యంలో మరో పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ కన్నా కొందరు కాంగ్రెస్ నేతలు కన్నయ్య గొప్పవాడని చిత్రీకరిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ఈ దిశగానే చర్యలు చేపట్టిందన్నారు. విభజన చట్టంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదాకు అడ్డంకిగా మారిందన్నారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ పేరుతో వీలునైంత ఎక్కువ నిధులు కేటాయించాలన్న ఆలోచనలు కేంద్రం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రత్యేక దేశంగా తీర్చిదిద్దాలన్న దృక్పధంతో ప్రధాని నరేంద్రమోదీ పలు దేశాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. టిడిపి, బిజెపి పార్టీలు సమైక్యంగా ఉన్నాయన్నారు. కేంద్రప్రభుత్వం సహకారంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన భరోసా ఇచ్చారు. విభజన విషయంలో ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబించడం దారుణమన్నారు. దేవాలయ పాలక మండలిలో స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి కార్యకర్తలకు స్థానం కల్పిస్తారని స్పష్టం చేశారు. ఇందులో బిజెపి కార్యకర్తలకు అన్యాయం జరిగే ప్రసక్తే రాదన్నారు.