చిత్తూరు

ఎంబిబి ఎస్ అడ్మిషన్లపై దళారీలను నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 11: స్విమ్స్ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎంబిబిస్ 2016-17 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్ల విషయంలో దళారీల మోసపుమాటలు నమ్మి మోసపోవద్దని స్విమ్స్ పద్మావతి వైద్య కళాశాల రిజిస్ట్రార్ డాక్టర్ ఆంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎన్ ఆర్ ఐ, ఎన్ ఆర్ ఐ స్పాంసర్ కేటగిరికి చెందిన 23 సీట్లు నీట్ ఫలితాలు వెల్లడైన తరువాత భర్తీచేస్తామన్నారు. అయితే దళారీలు తాము అక్రమ మార్గంలో సీట్లు ఇప్పిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నట్లు తమదృష్టికి రావడంతో వారిని అప్రమత్తం చేసేందుకు ఈ ప్రకటనచేశామన్నారు. ఇప్పటికే రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్‌కు సంబంధించి 123 సీట్లు భర్తీచేశామన్నారు.