చిత్తూరు

సంగీతా చటర్జీకి కోల్‌కతా హైకోర్టు అరెస్టు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 21: ఎర్రచందనం అక్రమ రవాణాలో తెరపైకి వచ్చిన కోల్‌కతాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతా చటర్జీకి కోల్‌కతా హైకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. దీంతో పుష్కరాల అనంతరం లేడీ డాన్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా సంగీతా చటర్జీని అరెస్టు చేయడానికి పలుమార్లు ప్రయత్నిస్తున్నా తరచూ బెయిల్ మంజూరవుతున్న తరుణంలో ఇది సాధ్యం కాలేదు. చిత్తూరు పోలీసులు సీరియస్‌గా తీసుకొని చట్టపరంగానే ఆమెను అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకొచ్చేందకు రంగం సిద్ధం చేశారు. కోల్‌కతాకు చెందిన బడా స్మగ్లర్ లక్ష్మణ్‌ను ఇటీవల చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అనేక సంవత్సరాలుగా లక్ష్మణ్ ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక పాత్ర వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పిడి యాక్టు కింది కేసు నమోదు చేసి కడప జైలుకు తరలించారు. అప్పటి నుంచి అతని భార్య సంగీతా చటర్జీ అతని ఆర్థిక లావాదేవిలు నిర్వహించడంతో పాటు బడా స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని ఎర్రచందనం అక్రమరవాణాలో కీలక పాత్ర వహించేది. ఈ క్రమంలో ఆమెపై చిత్తూరు జిల్లాలో యాదమరి, చిత్తూరులో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పలుమార్లు చిత్తూరు పోలీసులు కోల్‌కతాలోని సంగీతా చటర్జీ స్థావరాలపై దాడులు నిర్వహించి విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లతోపాటు సుమారు రెండుకోట్ల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నించినా అక్కడ స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వీలు కాని పరిస్థితి నెలకొంది. తాజాగా ఆమెను అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకురావడానికి కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో సంగీతా చటర్జీపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయంచడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలసింది. ప్రస్తుతం జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా అధిక సంఖ్యలో పోలీసు సిబ్బంది పుష్కరాలకు తరలివెళ్లారు. దీంతో పుష్కరాలు పూర్తయిన వెంటనే కొందరు మహిళా పోలీసు సిబ్బందితో కోల్‌కతాకు వెళ్లి ఆమెను అరెస్టు చేసి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది.