చిత్తూరు

తప్పుల తడకగా కాంట్రాక్టు ఉద్యోగ అభ్యర్థుల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 23:రెగ్యులర్ ఉద్యోగాలకే కాకుండా కాంట్రాక్టు ఉద్యోగాల ఎంపికలోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నో కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా రూపకల్పనలో కొందరు అవకతవకలకు పాల్పడిన సంఘటనలు మరవకముందే అలాంటి సంఘటనే తాజాగా తిరుపతి నగరంలోని జిల్లా చిన్నారుల సత్వర చికిత్స కేంద్రం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగుల జాబితా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సంబంధిత ప్రాథమిక కేంద్రాలకు సంబంధించి డాక్టర్లు, ల్యాబ్‌టెక్నీషియన్లు, రేడియాలజిస్టులు, డెంటిస్టులు, స్లాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎం ఉద్యోగాలకు సంబంధించి గత నెలలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిరుద్యోగుల, విద్యార్హతలు, ఎంప్లాయిమెంట్ సీనియారిటితో ముడిపెట్టి ఉద్యోగులకు ఎంపిక చేయాలని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయ ఉద్యోగులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం పలు ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక చేసిన ప్రొవిజనల్ జాబితాలోని అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఈ ప్రక్రియలో జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్‌తో పాటు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే ప్రొవిజనల్ జాబితాలోని లోపాలను బహిర్గతం చేస్తూ ఇటీవల కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించడంతో అభ్యర్థులు అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ప్రొవిజనల్ జాబితాలోని అనర్హులను గుర్తించి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రమేష్‌రెడ్డిని నిలదీశారు. ఈ క్రమంలో గంట పాటు ఎంప్లాయిమెంట్ అధికారికి, అభ్యర్థులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి ప్రొవిజనల్ జాబితాలను మరోసారి తనిఖీచేసి ఇద్దరు అనర్హుల పేర్లను తొలగించి, వాటి స్థానాల్లో అర్హుల పేర్లను నమోదు చేయడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం అధికారులు అభ్యర్థుల సర్ట్ఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విషయంగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్‌ను వివరణకోరగా ఇద్దరు అనర్హుల పేర్లు పొరబాటున ప్రొవిజనల్ జాబితాలో చోటుచేసుకున్న మాటవాస్తవమేనని, వారి పేర్లను తొలగించి అర్హులను చేర్చామని తెలిపారు. సర్ట్ఫికెట్ల పరిశీలన తరువాత అర్హుల జాబితాను కలెక్టర్‌కు పంపుతామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులు రూపొందించిన జాబితా తప్పుల తడకగా ఉందని, అభ్యర్థుల జాబితా రూపకల్పనపై మరోమారు లోతుగా విచారణ జరిపితే మరింత మంది అనర్హుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు ఉద్యోగులు ఈ సందర్భంగా విలేఖరుల ముందు వాపోయారు. ఈ విషయంగా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు.