చిత్తూరు

పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గింలి: సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 5 : కేంద్రప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ పెట్రోల్, డీజల్ ధరలను అదుపు చేయడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెరిగిన ఈ ధరల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాల్లో ధరలు తక్కువగా ఉంటే భారతదేశంలోనే అధికంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటిని ప్రశ్నించారు. వ్యాట్, ఇతర పన్నుల పేరుతో పెట్రోల్ డీజల్ ధరలను తరుచూ పెంచడం దారుణమన్నారు. దీని వల్ల బస్సు ఇతర రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు ఆర్ముగంరెడ్డి, విజయకుమార్, విజయలక్ష్మి, జమిలాబి, కుమారి, బాజీరావు, శ్రీనివాసులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.