చిత్తూరు

విమానాశ్రయం తరహాలో బస్ స్టేషన్లు ఉండాలన్నదే సిఎం సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 26: రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన గొప్ప రాష్ట్రంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలూ కృషిచేస్తున్నారని, ఈ క్రమంలో విమానాశ్రయంలో ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాల తరహాలో బస్ స్టేషన్ కూడా అభివృద్ధి పరచాలన్నది సి ఎం సంకల్పమని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ఆర్టీసీ ఏర్పాటుచేసిన ఎసి సౌకర్యం కలిగిన 4 ఇంద్రా బస్సులకు ఆమె శుక్రవారం ఉదయం పచ్చజెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో తిరుపతి ఆర్టీసీ బస్ స్టేషన్‌ను కూడా ఎంతో అభవృద్ధి చేశారన్నారు. ఓల్వో బస్సులో ఉన్న సౌకర్యాల తరహాలో ఆర్టీసీ తక్కువ ఖర్చుతో బెంగళూరుకు బస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఈక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ప్రయాణించేందుకు వీలుగా మరిన్ని బస్సులు నడపాలని ఆమె అన్నారు. అలాగే సౌకర్యాలను కూడా మరింత పెంచాలన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలు ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
రూ.450లకే బెంగుళూరుకు ఎసి సౌకర్యంతో బస్సు - ఆర్ ఎం
ఆర్టీసీ కొంత నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రయాణీలకు సౌకర్యం కల్పించడంలో మాత్రం రాజీ పడటం లేదని, ఇందులో భాగంగానే బెంగుళూరుకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం రూ.450కే ఎసి సౌకర్యం కలిగిన బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ ఎం నాగశివుడు అన్నారు. తిరుపతి-బెంగుళూరు ఎసీ ఇంద్ర బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి సుఖ ప్రయాణం చేయించాలన్నదే ఆర్టీసీ లక్ష్యం అన్నారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యమనే సిద్ధాంతంతో ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఈనేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం సద్వినియోగం చేసుకుంటుందన్నారు. ఆర్టీసీ యాప్ ద్వారా ప్రయాణీకుడు తాను వెళ్లవలసిన బస్సు ఏ ప్రాంతంలో ఉంది. ఎన్నిగంటలకు బస్ స్టేషన్ చేరుతుంది అనే సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే సౌకర్యం కల్పించామన్నారు. అలాగే తాను ప్రయాణం చేసే బస్సు ఎన్ని గంటలకు గమ్యం చేరుతుందో కూడా ఈ యాప్‌ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో టిక్కెట్ రిజర్వ్‌చేసుకునే సౌకర్యం కల్పించామని, ఇందుకు సంబంధించి పలు రాయితీలు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తిరుపతి- బెంగుళూరు మధ్య ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటికే తాము తిరుపతి-బెంగుళూరుకు సాధారణ బస్సులతో పాటు లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఓల్వా బస్సులను నడుపుతున్నామన్నారు. అయితే తక్కువ ఛార్జీలతో ప్రయాణీకులకు ఎసి సౌకర్యం ఉన్న బస్సులను నడపడానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 4 బస్సులను తిరుపతి- బెంగుళూరు మధ్య నడిపేందుకు శుక్రవారం శ్రీకారం చుట్టామన్నారు. ప్రతిరోజూ ఉదయం 6,7,8 గంటలకు, అలాగే సాయంత్రం 5 గంటలకు బస్సులు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తాయన్నారు. ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరే బస్సు మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరుతుందన్నారు. అలాగే ఉదయం 7 గంటలకు బెంగళూరుకు బయలుదేరేబస్సు అదేరోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతికి బయలుదేరుతుందన్నారు. ఉదయం 8 గంటలకు బెంగళూరు బయలుదేరే బస్సు అదేరోజు సాయంత్రం 6 గంటలకు బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరుతుందన్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు తిరుపతిని నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు బెంగళూరు నుంచి తిరుపతికి బయలు దేరుతుందన్నారు. సుఖవంతమైన సీట్ల సౌకర్యం, ప్రతి సీటు వద్ద ఏసి తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. సౌకర్యాలన్నీ ఓల్వా బస్సు తరహాలో ఉన్నా ఛార్జీలు మాత్రం ఒక సామాన్యుడి సైతం ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసేవిధంగా ఈ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డి ఎం విశ్వనాథ్, డిప్యూటీ సి టి ఎం చంద్రశేఖర్, డిప్యూటీ సి ఎం ఇ శ్రీనివాస్, ఎటి ఎం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.