చిత్తూరు

విద్యార్థులను శాశ్వత మానసిక ఆనందానికి చేరువచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 29: భావి భారత నిర్మాతలైన విద్యార్థులను తాత్కాలికమైన భౌతిక ఆనందాల కంటే శాశ్వతమైన మానసిక ఆనందానికి దగ్గర చేయాలని టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు తెలిపారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన 33వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకు విజ్ఞానాన్ని భారతదేశం అందిస్తుందని, భారతీయులకు వారసత్వంగా సంక్రమించిన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల గురించి నేటితరానికి తెలియజేయాలని అన్నారు. మన వేదాలు, ఉపనిషత్తులలో తెలిపిన విధంగా మానవ జీవితంలో మనిషికి సమాజానికి మేలు చేసేది శ్రేయస్సు అని, వ్యక్తిగతంగా ఇష్టపడేది ప్రేయస్సు అని విద్యార్థులకు అర్థమయ్యేలా ఉదాహరణలతో వివరించారు. రాబోవు రోజుల్లో విదేశీ విశ్వవిద్యాలయాల విద్యను అభ్యసించాలంటే చదువులో ఒక్కటే ప్రతిభ ఉంటే సరిపోదని, సంగీతం, యోగా, నాట్యం వంటి వాటిలో ప్రావీణ్యం ఉండాలని తెలిపారు. విద్యార్థుల్లో సనాతన ధర్మం, నైతిక, మానవీయ విలువలు వంటి అంశాలపై అవగాహన పెంచేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు మరింత సులువుగా అర్థం చేసుకొని, ఇతరులతో పంచుకునేందుకు వీలుగా ఈ పరీక్షల సిలబస్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. టిటిడి ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి రవి మాట్లాడుతూ నేటి కుటుంబ వ్యవస్థలో నానమ్మ, తాతయ్య దూరమవుతున్నారని, ఈ కారణంగా పిల్లలకు మన చరిత్ర, ఆచార వ్యవహారాలు తెలియడం లేదని అన్నారు. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలో గుడుపుతారు కావున వారికి సంస్కారం నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు.చిన్న చిన్న కథల రూపంలో విద్యార్థులకు అర్థమయ్యేలా విలువల గురించి, మంచి చెడుల గురించి తెలియజేయాలని కోరారు. సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ద్వారా భావిభారత పౌరులైన విద్యార్థుల్లో ధర్మబీజాలు పడుతున్నాయని చెప్పారు. సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య జి దామోదరనాయుడు మాట్లాడుతూ 33 ఏళ్లుగా ఈ పరీక్షలు నిర్వహించి, వేలమంది విద్యార్థులకు సనానత ధర్మంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ధర్మపరిచయం, ధర్మప్రవేక పరీక్షల కోసం పంపిణీ చేస్తున్న పుస్తకాలు సమగ్రంగా ఉన్నాయని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, గురువుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.
ధర్మ పరిచయంలో చిత్తూరు జిల్లా విద్యార్థికి ప్రథమ ర్యాంకు
33వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ధర్మపరిచయం విభాగంలో చిత్తూరులోని దేవి బాలమందిరం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి కె మానస ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా ముల్ద్‌కల్ మండలం పాల్వాయ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 7వ తరగతి విద్యార్థిని ఎం మునేశ్వరి ద్వితీయ స్థానం, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు గ్రామంలోని ఎఎఎన్‌ఎం అండ్ వివిఆర్‌ఎస్ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థిని ఎన్ శ్రావణి తృతీయ స్థానం సాధించారు.
ధర్మప్రవేశికలో శ్రీకాకుళం జిల్లా విద్యార్థికి ప్రథమ స్థానం
33వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ధర్మప్రవేశిక విభాగంలో శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలోని అమ్మ ఒడి కానె్సప్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9వ తరగతి విద్యార్థి ఆర్ దుర్గాప్రసాద్ ప్రథమ స్థానంలో నిలిచాడు. అదేవిధంగా అదిలాబాద్ జిల్లా యాదమర్రి మండలం బురదగూడెంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని హెచ్ సాయిప్రీతి ద్వితీయ స్థానం, చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎ ప్రియాంక తృతీయ స్థానం సాధించారు.
చిత్తూరు జిల్లాలో..
33వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో చిత్తూరు జిల్లా విద్యార్థుల వివరాలిలా ఉన్నాయి. ధర్మ పరిచయం విభాగంలో చిత్తూరులోని దేవి బాలమందిర్ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థిని ఎస్ హబిఉన్నీస ప్రథమ స్థానంలో నిలిచింది. పెనుమూరులోని 7వ తరగతి విద్యార్థిని కె జోత్స్న ద్వితీయ స్థానం, తిరుపతిలోని ప్రభాత్ హైస్కూల్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి ఆర్ జ్ఞానదీప్ తృతీయస్థానం సాధించాడు. ధర్మప్రవేశిక విభాగంలో రామకుప్పం మండలం కెంపుసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సి సుష్మిత ప్రథమస్థానంలో నిలచింది. తిరుపతిలోని ప్రభాత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి సి హెచ్ లోకేష్‌సింగ్ ద్వితీయ స్థానం, ఎస్‌ఆర్ పురం మండలం చిలమాకులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి బి జనార్దన్‌రావు తృతీయ స్థానంలో నిలిచారు. రాష్టస్థ్రాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు, చిత్తూరు జిల్లాతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి ఐదుగ్రాముల బంగారు డాలర్ 4వేలు నగదు, రెండో స్థానం సాధించిన వారికి ఐదు గ్రాముల బంగారు డాలర్ 3వేల నగదు, మూడోస్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల బంగారు డాలర్, 2వేల నగదు అందించారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి ఐదుగ్రాముల వెండి డాలర్ వెయ్యి రూపాయల నగదు, రెండోస్థానం సాధించిన వారికి ఐదుగ్రాముల వెండి డాలర్ 750 రూపాయలు నగదు, మూడోస్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల వెండి డాలర్ 500 రూపాయలు నగదు అందించారు