చిత్తూరు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 2: అక్టోబరు 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఇఓ సాంబశివరావుశుక్రవారం తెలిపారు. డయిల్ యువర్ కార్యక్రమంలో మాట్లాడుతూ అక్టోబర్ 2వ తదేన అంకురార్పణ జరుగనుందని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు ఇత్యాది ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకులత పాటు పోలీసు సిబ్బంది సహకారాన్ని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్ వి సంగీత కళాశాల ఇతర ప్రాజెక్టుల అనుసంధానంతో భక్తి, ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల వాహనసేవలతో పాటు శ్రీవారి ఆలయంలో జరిగే స్నపన తిరుమంజనం ఇతర ధార్మిక కార్యక్రమాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన తెలిపారు.
డయల్ యువర్ ఇఓలో పనిచేయని ఫోన్లు
డయల్ యువర్ ఇ ఓ సందర్భంగా సుమారు 10 నిముషాల పాటు ఫోన్లు పనిచేయలేదు. దీంతో ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు ఓ వైపు టెలిఫోన్‌రంగం అద్భుతంగా ముందుకు సాగుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో అంతరాయం కూడా ఏర్పడి ఉంటుందని చమత్కరించారు. అయితే ఉదయం 8.30 నుంచి 9.30 వరకు జరగాల్సిన డయల్ యువర్ ఇ ఓ కార్యక్రమాన్ని ఇ ఓ 15 నిముషాలు పొడిగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చేశారు.