సబ్ ఫీచర్

దత్తన్న చేసిన తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నామినేషన్ వేసిన రోజే ఆయన కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు ఒడిగట్టింది. తనను తన పిల్లలను, నరకయాతనకు గురిచేస్తూ క్రూరంగా హింసిస్తున్న రాజయ్యకు ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వవద్దని ప్రాధేయపడుతూ సోనియాగాంధికి సారిక ఉత్తరం రాసింది. ప్రాధేయపడినప్పటికీ ఆయనకే ఆ పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో సారిక ఆందోళన చెంది అంత దారుణానికి పాల్పడింది. దీనికి సోనియా గాంధి బాధ్యత వహించాలని ఎవరూ అనలేదు! అనకూడదు! ఇప్పుడు దత్తన్నపై విరుచుకుపడుతున్న ఈ స్వయం ప్రకటిత మేధావులు-దళిత హక్కుల సంఘాలు-వామపక్ష నాయకులు రాహుల్ గాంధీ అప్పుడు ఏ లోకంలో ఉన్నారు?
1977 ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురై దిక్కుతోచని స్థితిలో వున్న ఇందిరమ్మ బిహార్‌లోని మారుమూల ‘బెల్చి’ గ్రామానికి ఎనుగునెక్కి వెళ్లి అక్కడ జరిగిన చిన్న సంఘటనను గోరంతలు కొండంతలుగా చేసి నాటి జనతా పార్టీ ప్రభుత్వంపై స్వైర విహారం చేసింది. అది ఇప్పుడు మనుమడికి గుర్తుకు వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో ఉంది. అప్పుడు నాయనమ్మ సాధించినట్టే ఇప్పుడు తాను సాధిస్తానని రాహుల్ గాంధీ అనుకుంటే అయ్యేది కాదు. ఢిల్లీలో వేలాదిమంది చూస్తుండగా -గజేంద్రసింగ్ అనే రైతును తన అనయాయులే పురికొల్పగా తన కళ్లముందే ఆ రైతు చెట్టుకు ఉరేసుకొని చస్తుంటే పట్టించుకోకుండా ఉత్సాహంగా ఉపన్యాసమిచ్చిన కేజ్రివాల్ ఇప్పుడు రోహిత్ మరణంపై సానుభూతి ఒలకబోస్తున్నాడు. మాయావతి, మమతా బెనర్జీ-లాలూ ప్రసాద్ ఇంకా చాలామంది రోహిత్ మరణాన్ని తమ కుళ్లు రాజకీయాలకు వాడుకోజూస్తున్నారు. అందరి గురి ఒక్కటే. భాజపా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా దాన్ని బ్రహ్మాస్త్రంగా చేసుకొని మోదీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడమే వీరి లక్ష్యం. హెచ్‌సియులో విద్యార్థి సంఘాల వైరుధ్యాలను దళిత-దళితేతర ఘర్షణగా రంగు పులుముతున్నారు. ఎబీవీపీలోనైనా మరే విద్యార్థి సంఘాలలోనైనా అన్ని కులాల, మతాల వారున్నారు. దాన్ని కుల ఘర్షణగా చిత్రించడం తప్పు.
దత్తాత్రేయ వల్లనే ఇంత దారుణం జరిగిందనడం హాస్యాస్పదం. ఎంపీ, ఎమ్మెల్యే ఇంకా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలనుంచి విజ్ఞప్తులు వచ్చినప్పుడు వాటిని సంబంధిత పై అధికారులతో లేదా మంత్రులకో పంపిస్తూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోమని ఉత్తరాలు రాస్తారు. అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదు. పైగా దత్తాత్రేయ ఏ ఒక్కరిపై ఎలాంటి ఆరోపణ జేయలేదు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదును పరిష్కరించాలని రాశారు అంతే. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కూడా ఇదే యూనివర్సిటీలో జరుగుతున్న అనేక ఆత్మహత్యలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే కేంద్ర మంత్రికి, దత్తాత్రేయ కంటే ముందు ఉత్తరం రాశారు. ఆయనది తప్పు కానప్పుడు దత్తాత్రేయది తప్పెలా అవుతుంది? దత్తన్న రోహిత్‌పై ఆరోపణ చేయలేదు. రోహిత్ రాసిన మరణ పత్రంలో దత్తన్నపై నింద మోపలేదు. కానీ ఈ పక్షపాత మేధావులు-హక్కుల సంఘాలు-కుల, వర్గ రాజకీయ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నాయకులు రోహిత్ పట్ల కార్చేది ముసలి కన్నీరు మాత్రమే. అసలు అక్కసంతా దత్తన్న దిగిపోవాలి-మోదీ ప్రభుత్వం బదనాం కావాలన్నదే.
వీరి కపట నాటకాలను విద్యార్థి సంఘాల వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కఠినమైన ఉరి శిక్షలపై తమ అభిప్రాయాలు చెప్పుకొనే స్వేచ్ఛ ఉండాల్సిందే. ఈ రాజ్యాంగ హక్కును ఎవరూ కాదనలేదు. విద్యార్థుల మధ్య వివాదం వచ్చింది కేవలం ‘‘యాకుబ్ మెమెన్ ప్రతి ఇంటా పుడతాడన్న’’ నినాదం గల బ్యానర్ వల్ల మాత్రమే. 250 మంది మరణానికి కారకుడైన ఈ ఉగ్రవాది ప్రతి ఇంటా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? ఆ విద్యార్థులంతా ఒక్కసారి గుండెలమీద చేయివేసుకొని ఆలోచిస్తే మంచిది. విద్యాలయాల్లో తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు గైకొనడం ఇప్పుడే జరిగిందా? పరీక్షహాల్లో కాపీ కొడుతూ పట్టుబడిన వారిని లోగడ సస్పెండ్ చేయలేదా? తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని డిబార్ చేయలేదా? అయినా దత్తాత్రేయ ఎవరినీ సస్పెండ్ చేయాలని ఉత్తరంలో రాయలేదే? పోనీ ఉత్తరం రాసినందుకే రాజీనామా చేయాలంటే ఇదే హెచ్‌సియులో జరుగుతున్న అక్రమాలు, ఆత్మహత్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దత్తన్న కంటే ముందు ఉత్తరం రాసిన కాంగ్రెస్ ఎం.పి. హన్మంతరావు రాజీనామా చేయాలని అడగరెందుకు? దత్తన్న మోదీ ప్రభుత్వంలో మంత్రి కాబట్టి ఆయనపై కక్ష కట్టారు. నిన్న బిహార్ ఎన్నికల్లో బిజెపిని దెబ్బతీయడానికి అసహనం అనే లేని భూతాన్ని చూపించి అవార్డుల వాపసీ నాటకాన్ని ఆడించారు. ఇప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల కోసం ఈ కొత్త నాటకానికి తెరలేపారు. బిహారు ఎన్నికలు అయిపోగానే అసహన నాటకం సమాప్తమైనట్టే, ఈ కొత్త నాటకం కూడా ఆగిపోతుంది. హెచ్‌సియులో అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండా అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకామెకు కేంద్రంలో మంత్రి కావాలన్న కోర్కె బలీయంగా వుందన్న పుకారొకటి ప్రచారంలో ఉంది. బహుశా దత్తాత్రేయ దిగిపోతే ఆ కుర్చీలో కూర్చోబెడతారని అనుకున్నారో ఏమో దత్తన్న ఇంటిని ముట్టడించి-దిగిపొమ్మంటూ పెడబొబ్బలు పెట్టారు. కేంద్రంలో మంత్రిపదవి ఖాళీ అయితే అది ఆ పార్టీ లేదా, మిత్రులకో దక్కుతుంది కాని పరులకు ఎలా దక్కుతుంది? ఎవరి ఎజెండా వారిది. రోహిత్ విషాద మరణం కాని, విద్యార్థుల వైరుధ్యాల పరిష్కారం కాని వాళ్ల ఎజెండాలో లేదు. ఇల్లు కాలుతుంటే చలికాగడమే వారి ఎజెండా.

- మందాడి సత్యనారాయణ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) సెల్: 9866326248