సబ్ ఫీచర్

డిటెన్షన్ విధానం మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో పరీక్షలలో వచ్చే మార్కులతో సంబంధం లేకుండా 1నుండి 10వ తరగతి (కొన్ని రాష్ట్రాలలో 8వ తరగతి) వరకు విద్యార్థులను పై తరగతికి పంపుతున్నారు. అంటే డిటెన్షన్ విధానం లేదన్న మాట. కొందరు నిదానంగా చదువునేర్చుకొనడంవల్ల, పరీక్షలలో తప్పితే విద్యార్థులపై అవాంఛనీయ ప్రభావం వుండటంవల్ల, డిటెన్షన్ విధానం రద్దుచేయడం జరిగింది. డిటెన్షన్ విధానం అమలుచేస్తే విద్యార్థులు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు విద్యకు దూరమవుతారని భావించడం వల్లనే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
అక్షరాస్యత విషయంలో మన దేశం ఇంకా వెనకబడే వుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత శాతం 73- పురుషులలో 80.90 శాతం, స్ర్తిలలో 64.60 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత శాతం 67.42- పురుషులలో 74.83 శాతం, స్ర్తిలలో 60.01 శాతం. ఇటువంటి పరిస్థితులలో డిటెన్షన్ విధానం వుంటే అక్షరాస్యత పెంచడం కష్టం. మధ్యలో చదువు మానేసే సమస్య కూడా వుంది. 1వ తరగతిలో ప్రవేశించిన వారిలో సుమారు 20 శాతం 5వ తరగతికి చేరడం లేదు, 36 శాతం 8వ తరగతికి చేరడం లేదు. డిటెన్షన్ విధానంవల్ల ఈ పరిస్థితి విషమించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1971లోనే డిటెన్షన్ పద్ధతిని రద్దుచేసింది. మళ్ళీ ప్రవేశపెట్టాలని చూస్తున్నది. దీనికి ప్రధాన కారణం విద్యాప్రమాణాలు పడిపోవడమే. 2014-15 సంవత్సరంలో ఐదవ తరగతిలో 11 శాతం విద్యార్థులు ‘ఎ’+ గ్రేడ్ తెచ్చుకున్నారు. 44 శాతం ‘ఎ’గ్రేడ్, 29 శాతం ‘బి’+ గ్రేడ్, 7 శాతం ‘బి’గ్రేడ్, 9 శాతం ‘సి’గ్రేడ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యారంగంలో ప్రమాణాలు బాగా క్షీణించాయి. ఒక సర్వే ప్రకారం 8వ తరగతి చదివే విద్యార్థులలో 25 శాతం మంది 2వ తరగతి పుస్తకాలను చదవలేకపోతున్నారు. ఈ పరిస్థితికి డిటెన్షన్ విధానం లేకపోవడమే ఏకైక కారణం కాకపోయినా అది ఒక ప్రధాన కారణంగా కనబడుతున్నది. డిటెన్షన్ విధానం ఎత్తివేయడంవల్ల విద్యార్థులలోను, ఉపాధ్యాయులలోను విద్యపై నిర్లక్ష్యవైఖరి పెరిగింది. చదువుపై విద్యార్థులు, బోధన విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. ఇదే ఒక పెద్ద సమస్య.
ప్రస్తుత పరిస్థితులలో డిటెన్షన్ విధానాన్ని అవలంభిస్తూనే దాని దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు. పాస్ అవడానికి కావలసిన మార్కులు తగ్గిస్తే (8 లేక 10వ తరగతి వరకు) విద్యార్థులు నిరుత్సాహపడకుండా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కొందరు సమస్యకు ఇంకొక పరిష్కార మార్గం చూపుతున్నారు. అదేంటంటే పదవ తరగతి పరీక్షా ఫలితాలను 8,9 తరగతుల మార్కులతో ముడిపెట్టడం. ఈ విధానంవల్ల 8,9,10 తరగతులు చదివే వారిలో చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యాప్రమాణాలను పెంచడానికి ప్రత్యేక కృషిలేకుండా డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయడం శ్రేయస్కరం కాదనిపిస్తుంది. డిటెన్షన్ విధానంలో కూడా మార్పులు తేవచ్చు.
లక్ష్య నిర్దేశం అనేది ఉన్నప్పుడు, దాన్ని సాధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరిపైనా ఉంటుంది. ప్రతి తరగతిలో వీరిరు వురి లక్ష్యం ఆ స్థాయకి నిర్దేశించిన ప్రమాణాన్ని సాధించడం. అందుకు మార్కులు లేదా గ్రేడ్‌లు వేటినైనా కొలమానంగా పెట్టవచ్చు. మిగతా కారణాలు ఎలావున్నా, ప్రమాణ నిర్ధారణ వల్ల ప్రతి స్థాయలోనూ లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కనుక కృషి తప్పకుండా ఉంటుంది. అప్పుడు ఉపాధ్యాయుడు, విద్యార్థి తగిన బాధ్యతతో పనిచేస్తారు. కానీ డిటెన్షన్ విధానం లేకపోవడం వల్ల లక్ష్యం ఉండటం లేదు. దీని ఫలితమే ఉదా సనత. ఇదే విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణమవుతున్నది. ఇక డ్రాపౌట్ల సంగతి చెప్పాలంటే, డిటెన్షన్ లేకపోయనా డ్రాపౌట్లు ఉంటూనే ఉన్నాయ. అందువల ప్రామాణిక విద్యను సాధించాలంటే డిటెన్షన్ ఉంటేనే మంచిది.

- డా.ఇమ్మానేని సత్యసుందరం