పర్యాటకం

వ్యాధులను బాపే ధర్మలింగేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం రుద్రాయ నమః, ఓం నీల కంఠాయనమః, ఓం నమశ్శివాయనమః అంటూ పండితులంతా పరమేశ్వరుడిని అభిషేకాదులతోను, అర్చనాదులతోను పూజిస్తుంటారు. అటువంటి శివుణ్ణి పామరులే కాదు జంతువులుకూడా పూజించి తమ జన్మను సాఫల్యం చేసుకొన్నట్లు మనకు చరిత్ర చెబుతోంది. అటువంటి శివుడు నేడు...
విశాఖ పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో గాజువాక యలమంచలి దారిలో స్వయంభువుగా వర్థమానలింగరూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ క్షేత్రం కొన్నాళ్లు వైభోగాలు అనుభవించి ఆ తరువా త కాలంలో ఆ శివాలయం జీర్ణా వస్థలోకి జారుకొంటున్నదట. ఆ సమయం లో కర్మలకు ఫలితాల నిచ్చే కాలుడు తనకు కర్మశేషంగా వచ్చిన కుష్ఠురోగాన్ని పోగొట్టుకోవడానికి యమధర్మరాజు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాలగర్భంలో కలసిపోతున్న ఈ శివలింగాన్ని బయటకు తీసి మరలా పునఃప్రతిష్ఠించాడట. దానితో ఈ శివలింగానికి ధర్మలింగేశ్వరుని నామం ఏర్పడింది. ఈ ధర్మలింగేశ్వరుణ్ణి కొలిచినవారికి వ్యాధులు దూరమవుతాయట. అంతేకాక ముక్తినిచ్చేవాడే ఈ ఈశ్వరుడేనని భక్తులు నమ్మికొలుస్తారు.
ఈ క్షేత్ర రాజంలోనే భూగర్భంలో నుంచి ఐదుచోట్ల జలధారలు వుబికి వస్తాయ. ఇది ఫణిగిరి పర్వతం క్రింద వుండే రాంబిల్లి మండలంలో ఈ జలధారల పొంగులు కనిపిస్తాయి. ఈ ఐదు జలధారల పేర్లమీదే ఈ క్షేత్రానికి పంచధారలు అన్న పేరు ఏర్పడింది. కాలక్రమేణ పంచజలధారలు కాస్త పంచధార్లగా మారిపోయిందని స్థలపురాణాలు చెబుతున్నాయ. ఈ పంచధారాల్లో స్నానం చేస్తే పూర్వకర్మలు నశిస్తాయని అంటారు. ఈ పంచధారలలో నీటిలో గంధకం శాతం ఎక్కువగా ఉన్నందువల్లే ఇక్కడ స్నానాలు చేసేవారికి అనేకానేక రుగ్మతలు పోతున్నాయని హేతువా దులుచెబుతారు. ఈ ధర్మలింగేశ్వరుని పాండవులు కూడా కొలిచినట్లు చెప్తారు. ఈ ఫణిగిరి పర్వతంపైనే ఓ గుహ వుంది. ఆ కాలంలో పాండవులు ఇందులో కొంతకాలం నివసించారని అందుకే ఈ గుహకు పాండవుల గుహ అన్న నామం ఏర్పడిందనీ అంటారు. ఈ ధర్మలింగేశ్వరుడి ఆలయాని కన్నాముందు రాధామాధవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో భూమిలో నుంచి వచ్చే పంచధారలను కలిపే ఓ తటాకం కనిపిస్తుంది. ఈ తటాకాన్ని హరినరేంద్రుల రాజులు నిర్మించినట్లు చారిత్రికాధారాలు తెల్పుతున్నాయి.
ఈ పంచధారల క్షేత్రంలో నారసింహుడు మొదట పాదం మోపాడట. కాని ధర్మలింగేశ్వరుడు ఆయన్ను సింహగిరిలో నివాసమేర్పచుకోమన్నందు వల్ల సింహగిరిలో కొలు వై సింహగిరి నరసింహుడుగా వసిస్తున్నాడని ఐతిహ్యం. ఈ నరసింహుని పాదముద్రలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయ.
ఈ రాధామాధవాలయానికి పశ్చిమంలో అతి ప్రాచీనమైన కాశీవిశే్వశ్వర ఆలయం కూడా కనిపిస్తుంది. దీనిని యలమంచలి నాగేంద్ర దేవుడనే రాజమహేంద్రవరపు గవరశెట్టి నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.ఈ ధర్మలింగేశ్వరుడికి శివరాత్రి మహోత్సవాలు, ఫాల్గుణశుద్ధ పౌర్ణమినాట కల్యాణాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.

- చోడిశెట్టి శ్రీనివాసులు