పర్యాటకం

జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ వె లిశాయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. సిరిగలవానికి జెల్లును దరుణు పదియారు వేల దగ బెండ్లాడన్ దిరిపెమున కిద్దరాండ్రా పరమేశా గంగ విడుము పార్వతి చాలున్’’ అని శ్రీనాధుడు ఏ సందర్భంగా ఈ చాటువును అల్లేడు?
ఎ) శ్రీనాధుడు కృష్ణుడుకి అఖండ భక్తుడు
బి) శివుడు అంటే గిట్టదు
సి) పల్లవులు పాలించిన పల్నా డులో నీటి ఎద్దడి చూసి
డి) రాయలసీమలో పర్యటించినపుడు గుక్కెడు త్రాగు నీళ్లు దొరకనపుడు
2. తైత్తిరియో ఉపనిషత్తు ప్రకారం ఏ తత్వాలు జ్యోతిర్లింగాలుగా వెలిశాయి?
ఎ) బ్రహ్మ, ఆకాశం, వాయువు, జలం, పృథ్వి, మాయ
బి) జీవుడు, మనసు, బుద్ధి, చిత్తం, తేజస్సు
సి) అహంకారం
డి) పైనవన్నియు
3. భారత గడ్డమీద జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ వెలిశాయి?
ఎ) పుణ్యనదుల తీరాన మూడు, సముద్రపు ఒడ్డున రెండు, మైదానాల్లో మూడు, పర్వతాలపై నాలుగు
బి) మహారాష్టల్రో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో మూడు, మధ్యప్రదేశ్‌లో నాలుగు
సి) ఉత్తర భారతాన నాలుగు, దక్షిణాన నాలుగు, పడమట ఒకటి, తూర్పున మూడు
డి) పైవేవీ కావు
4. మహారాష్టల్రో నాసిక్‌లోనున్న జ్యోతిర్లింగాన్ని త్రయంబకేశ్వరుడుగా పిలవటానికి కారణమేమిటి?
ఎ) జ్యోతిర్లింగాల్లో ఇది మూడవది
బి) మహారాష్టల్రో వెలసిన జ్యోతిర్లింగాల్లో ఇది మూడవది
సి) ఈ జ్యోతిర్లింగంతోపాటు మరో మూడు చిన్న లింగాలు త్రిమూర్తుల ప్రతిరూపాలుగా వెలిశాయి
డి) గోదావరి ఒడ్డున వెలసినందున
5. ఆదిశంకరుల శివానందలహరిని ఏ జ్యోతిర్లింగంవద్ద కూర్చుని రాసేరని భావిస్తున్నారు
ఎ) కేదార్నాధుడు
బి) రామేశ్వరుడు
సి) కాశీ విశే్వశ్వరుడు
డి) శ్రీశైల మల్లికార్జునుడు
6. స్కాంద పురాణం ప్రకారం కుమారస్వామి, తారకాసురుడిని వధించినపుడు అతని గొంతులోనున్న ఆత్మలింగం ముక్కలుగా పడితే దేవతలు వాటిని వేరు ప్రదేశాలలో ప్రతిష్ఠించారు. ఆ ప్రదేశాలే?
ఎ) శ్రీకాళహస్తి
బి) పంచారామాలు
సి) జ్యోతిర్లింగాలు
డి) శైవ క్షేత్రాలు
7. పంచారామాలకి సంబంధించి క్రిందివాటిలో ఏది సరియైనది?
ఎ) అమరారామం, దక్షారామం, కుమారారామం, శ్రీరారామం, భీమారామంలే పంచారామాలు
బి) అమరావతి, ద్రాక్షారామము, సామర్లకోట, పాలకొల్లు, భీమవరంలలో / సమీపాన పంచారామ క్షేత్రాలున్నాయి.
సి) పంచారామాలలో శివుడు- అమరేశ్వరుడు, భీమేశ్వరుడు, రామలింగేశ్వరుడు, సోమేశ్వరుడు రూపంలో కొలువున్నాడు
డి) పైవన్నియు
8. శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన కవి ఎవరు?
ఎ) అయ్యలరాజు రామభద్రుడు
బి) చేమకూర వెంకట కవి
సి) పెద్ద దూర్జటి
డి) పిన వీరభద్రుడు
9. శ్రీనాధుడు ఎన్నో గ్రంధాలు, పద్యాలు, కావ్యాలు రచించేడు. దిగు వాటిలో ఆయన రచించినవేవి?
ఎ) బసవ పురాణం, శ్రీకాళహస్తి మహత్మ్యం, శివపురాణం, మార్కండేయ పురాణం
బి) శివరాత్రి మహత్మ్యం, భీమఖండం, కాశీఖండం
సి) శంకరాభరణం, బ్రహ్మరుద్రుడు, శివరంజని, శ్రీశైల మహత్మ్యం
డి) పైవన్నియు
10. దక్షిణామూర్తి ఉపనిషత్తు ఏ వేదానికి అనుబంధమైనది?
ఎ) అధర్వణవేదం
బి) సామవేదం
సి) రుగ్వేదం
డి) కృష్ణ యజుర్వేదం
11. శుక్లయజుర్వేదంకి సంబంధించిన జభలోపనిషత్ దేని గురించి చర్చిస్తుంది?
ఎ) ఆధ్యాత్మిక జ్ఞానం
బి) కాశీ నగరం విశిష్టత, పవిత్రత
సి) సన్యాసం, ప్రాపంచిక జీవనం త్యజించటం
డి) పైవన్నియు
12. జపం, మంత్రధ్యానం ప్రతీకాత్మత మరియు జపమాల, అక్షరమాల ప్రాముఖ్యత గురించి వివరించే ఋగ్వేదంలోని ఉపనిషత్తు పేరేమిటి?
ఎ) అక్షరమాలికోపనిషత్తు
బి) కైవల్య ఉపనిషత్తు
సి) పంచబ్రహ్మ ఉపనిషత్తు
డి) శరభ ఉపనిషత్తు
జవాబులు: 1-సి, 2-డి, 3-ఎ, 4-సి, 5-డి, 6-బి, 7-డి, 8-సి, 9-బి, 10-డి, 11-డి, 12-ఎ.

- సునీల్ ధవళ