పర్యాటకం

ప్రశాంతతకు చిరునామా బంగారు గ్లోబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను నా కుటుంబంతో కలసి యాత్రలు చేయడం మామూలు విషయమే. కాని ఈ మధ్య మేము పాండిచ్చేరి, మహాబలిపురం లాంటి ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు పాండిచ్చేరికి సుమారు 12కి.మీ దూరంలో ఆరోవెల్లి అనే గ్రామంలో ఒక ధ్యానమందిరాన్ని చూసాం. ఇది మాకు ఎంతగానో నచ్చింది. దాన్ని గురించి రెండు మాటలు మీతో చెబుదామని ... దిమదర్ ఆఫ్ ది శ్రీ అరవిందో ఆశ్రమం వారు దీన్ని ప్రారంభించారని అక్కడివాళ్లు చెప్పారు. 12 రేకులతో భారీ గోళాకారంగా ఈ ధ్యానమందిరాన్ని నిర్మించారు. దీన్ని చూస్తుంటే మనకు ఒక బంగారు గ్లోబ్‌లాగా కనిపిస్తుంది. దాని లోపల పెద్ద ధ్యానమందిరం ఉంది. గ్లోబు చుట్టూ పెద్ద ఉద్యానవనం ఉంది. చల్లటి వాతావరణం, పచ్చని పచ్చిక, అక్కడక్కడ నవ్వుతున్నట్లుగా పూసిన పూలు అసలీ వాతావరణంలోకి రాగానే మనసు ఒక ప్రశాంతతను పొందుతుంది. ఇక ఈ బంగారు గ్లోబులోకి వెళ్లగానే అదొక ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కల్గుతుంది. ఆ తరువాత ఇక్కడ ధ్యానం చేసిన కొద్దిసేపట్లోనే మనసు ఎంతో ప్రశాంతతపొందుతుంది. రోజులో కాసేపైనా ఇక్కడ ధ్యానం చేస్తే మానసిక చింతలు పోతాయనిపించింది. అందుకే ఈ ధ్యానమందిరానికి విదేశీయులు సైతం ఆకర్షించబడి వస్తుంటారు.
మేము తిరిగి చూసిన రాక్‌బీచ్ , అరిమిస మాణికుల వినాయగర్ గుడి, దిబిలిక దిసేక్రేడ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ జీసస్ చర్చి, మ్యూజియం, మహాబలిపురం లోని షార్ టెంపుల్, పంచరధాస్ వరాహగుహ టెంపుల్ కృష్ బాల్ ఇలాంటివెన్నో తిరిగి చూసినా మాకు మాత్రం ఆ బంగారు గ్లోబు మనసులో స్థిరపడిపోయింది. దీన్ని అందరూ కూడా చూసి మానసిక ప్రశాంతతను పొందాలని ఇలా నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

- వి. లలిత,చెన్నై