సబ్ ఫీచర్

లక్ష్య సాధనపైనే నాయకుడి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని పాఠశాలలను సమర్ధవంతమైన స్కూళ్లంటాం. కొన్నింటిని ఎక్స్‌లెన్సీ స్కూళ్లంటాం. కొన్నింటిని విశిష్టమైన స్కూళ్లంటాం. సమాజంలో పాఠశాలల్లో ఈ సున్నితమైన ఈ తేడాకు కారుకులెవరు? ఆ పాఠశాల యొక్క నాయకుడే. కొంతమంది హెడ్‌మాస్టర్ అంటే తలపంతులు అనుకుంటారు. భౌతికమైన ఆకారమే కాదు, హెడ్‌మాస్టర్‌కు ఒక దృక్పథముంటుంది. ఆ దృక్పథాన్ని దీక్షతో అమలుచేస్తే అది మిషన్ అవుతుంది. ఒక స్కూలు స్వరూపాన్ని తీర్చిదిద్దేది హెడ్‌మాస్టర్‌యొక్క పని. ఆ హెడ్‌మాస్టర్ స్కూల్లో అడుగుపెట్టిన దగ్గరనుంచి ఇంటికి వెళ్లేవరకు ఆ నాయకుడు లేదా నాయకురాలు చేసే పనివిధానమే స్కూలు స్వభావాన్ని నిర్ణయిస్తుంది. స్కూలు నిర్వాహకులకు రాత్రింబవళ్లు స్కూలే. దాని అభివృద్ధే వారి ఆలోచన. నురుపుతుంగ హైస్కూల్ ప్రిన్సిపాల్ కృపాచారి రాత్రి 10 గంటల వరకు పిల్లల ఇళ్లు తిరిగేవాడు. ఉదయం 8 గంటలకు తిరిగి స్కూల్లో ప్రత్యక్షమయ్యేది. ఆయన స్కూల్ నిర్వహణలో ప్రతి విషయంలో భాగస్వామి అయ్యేవాడు. తరగతి గది చదువు కావచ్చును, గ్రౌండ్‌లో ఆటలు జరుగుతు వుండవచ్చును, లైబ్రరీలో అధ్యయనం కావచ్చును. లేక సాయంత్రం పిల్లలపై పర్యవేక్షణ కావచ్చును. ఉపాధ్యాయ వర్గం ఏమి చేయాల్నో తన పనితో చూపించేవాడు. హెడ్‌మాస్టర్ ఆఫీసులో కూర్చుని ఆర్డర్‌లు పాస్ చేయడు. తన పనితో ఉపాధ్యాయ వర్గం తమ కర్తవ్యాన్ని అర్ధం చేసుకుంటారు. ఉదయం 8 గంటలనుంచి మూత్రశాలల నుంచి సైన్స్ ప్రయోగశాల వరకు తనే చూసుకుంటాడు. విద్యార్థులకు ఉపాధ్యాయ వర్గానికి హెడ్‌మాస్టర్ ప్రెజెన్స్‌నే ఎనర్జీ తన లక్ష్యాన్ని ప్రతివానిలో కలిగిస్తాడు. పాఠశాలను హెడ్‌మాస్టర్ ఒక కుటుంబం అనుకుంటాడు.
సమూహాన్ని ఒక లక్ష్యం వైపుకు నడిపించేవాడే నాయకుడు. స్కూలుకు ప్రతీక హెడ్‌మాస్టర్. ఉపాధ్యాయ వర్గానికి ఆదర్శమైన ఉపాధ్యాయులుగా ఉంటారు. తన బోధన విద్యార్థులకు బెంచిమార్క్. ఏ ఉపాధ్యాయునికి ఏ సమస్య వచ్చినా హెడ్‌మాస్టర్ వారితో కలిసి పని చేస్తాడు. అందుకే ఉపాధ్యాయుని బోధనలో నాయకుడుగా నిలుస్తాడు. అంతేకాక ప్రతి పాఠశాలకు ఒక నాగరికత ఉంటుంది. ఆ నాగరికతను నిర్ధారించడమే కాకుండా ఆ వాతావరణానికి, ఆ సంస్కృతికి గార్డియన్‌గా ఉంటారు. తన పనిని లక్ష్యంవైపు గురిపెట్టి ఆచరించి చూపుతాడు కాబట్టి ఆ హెడ్‌మాస్టర్ మాటలు గుండెలకు హత్తుకుంటాయి. ఆయన మాటల్ని ఉపాధ్యాయులు ప్రమాణంగా తీసుకుంటారు. హెడ్‌మాస్టర్ లక్ష్యాలకు అనుగుణంగా తరగతి గది, ఆ ప్రాంగణం నడుచుకుంటుంది. ఆయన ప్రతిమాట ఆ ప్రాంతానికి శిలాక్షరం.
తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను సాధించేందుకు ప్రతి ఉపాధ్యాయునిలో ఆ దీక్షను కలిగించాలి. తానే నాయకుడు కాకుండా అందరు ఉపాధ్యాయులను ఒక టీమ్‌గా, నాయకుల బృందంగా తయారుచేస్తాడు. సంస్థ నిర్వహణ ఒక వ్యక్తి పని కాదు. అది ఒక జట్టు పని. ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగానికి నాయకుడుగా తీర్చిదిద్దాలి. ఉపాధ్యాయ బృందం నిర్ణయాలనే తన నిర్ణయాలుగా తీర్చిదిద్దుకుంటాడు. ఏ విద్యార్థినైనా నిరాశ నిస్పృహలకు గురి చేయడు. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుని వ్యవహరిస్తాడు. తప్పు చేస్తే శిక్షించిన దానికన్నా ప్రాసెస్‌లో ఎక్కడ తప్పు జరిగిందో చూస్తాడు. అది పిల్లల సమస్య కావచ్చు, ల్యాబ్ సమస్య కావచ్చు, తల్లిదండ్రుల సమస్య కావచ్చు. దేన్నయినా పరిష్కరించగల శక్తి సామర్ధ్యాలు ఆ నాయకుడికి ఉండాలి. పనిలో ఎవరు తప్పు చేసినా సమాజం ముందు తనే బాధ్యత వహిస్తాడు. ఇది ఎవ్వరిమీద నెట్టివేయడు. ఒక స్కూలుకు నాయకుడిగా ఎదగడానికై సబ్జెక్టులలో ప్రవీణత, సామూహిక అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం, ప్రజాస్వామికమైన నాయకుడిగా తయారు కావడం జరగాలి. అన్నింటికి మించి తను చెప్పిన మాటలను తాను ఆచరించాలి. హెడ్‌మాస్టర్ పని స్కూలు స్వభావాన్ని సమాజాన్ని నిర్ణయిస్తుంది.

- చుక్కా రామయ్య