సబ్ ఫీచర్

హిందువులపై ఎందుకింత వివక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇండియా దటీజ్- భారత్’’అని రాజ్యాంగం తయారుచేసుకుని, మనది ‘సెక్యులర్ స్టేటు’అని గొప్పగా వర్ణించుకుంటున్నాం. స్వరాజ్యం వచ్చి 68 సంవత్సరాలు పైబడినా రాజ్యాంగాన్ని అతుకులబొంతగా తయారుచేస్తున్నాము. అనేక వివక్షతలు చూపుతున్నాము. మన దేశ ధర్మ, సంస్కృతులకనుగుణ్యమైన కొత్త రాజ్యాంగం నిర్మించి భారతదేశంలో వివక్షతలు, తేడాలు పోగొట్టవలసిన అవసరం వున్నది.
ప్రపంచంలో సుమారు 52 పైబడి ముస్లిం దేశాలున్నాయ. హజ్ యాత్రకు సబ్సిడీ యిచ్చే ముస్లిం దేశం ఒక్కటీ లేదు. భారతదేశంలో ముస్లింలకు ఇచ్చే ప్రత్యేక హక్కులు, హిందువులకిస్తున్న ముస్లిం దేశం ఎక్కడా లేదు. అలాగే ముస్లిమేతరుడు దేశాధ్యక్షునిగా, ప్రధానమంత్రిగా ఉన్నదీ లేదు. మన దేశంలో 85% ఉన్న మెజారిటీ వర్గం, 15% ఉన్న మైనార్టీవర్గం దయకోసం వెంపర్లాడటం మరెక్కడా లేదు. దేశద్రోహులుగా మారిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఏ ముల్లాకానీ, వౌల్వీకానీ, ఫత్వాలు జారీచేయలేదిప్పటికింకా. విశాల హృదయంతో హిందువులు మెజార్టీగాఉన్న మహారాష్ట్ర, బిహార్, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలలో లోగడ ముస్లింలను ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ముస్లిం మెజార్టీ కలిగిన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో హిందువు ముఖ్యమంత్రి కాలేరు. ఈ దేశంలో హిందువులు సహనం లేనివారయితే, మసీదులు, మదరసాలు లెక్కలేనన్ని అభివృద్ధిచెందలేవు. భారతదేశంలో 30% భూమిని ఆటవిడుపుగా ముస్లింల (పాకిస్థాన్)కిచ్చి, హిందూ పవిత్ర స్థలాలు అయోధ్య, మధుర, కాశీలకోసం భిక్షమెత్తుకోరు. దేవాలయాల నిధులను ముస్లిం, క్రైస్తవుల సంక్షేమానికి వాడుతున్నారు. హిందువులు, ఇష్టంవచ్చిన రీతిలో వాడుకో స్వేచ్ఛలేదు. దేవాలయ భూములను ప్రభుత్వం అమ్మేస్తున్నది. మసీదు, ఖబరిస్థాన్ భూములకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నది. పౌరులందరికీ యూనిఫామ్ సివిల్‌కోడ్ లేనే లేదు. జమ్ము-కాశ్మీర్, మిజోరం, మేఘాలయాలలో హిందువులు మైనార్టీలు, మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌లాంటి రాష్ట్రాలలో ముస్లిం, క్రైస్తవులు మైనార్టీ వర్గాలైతే వారికిచ్చే మైనార్టీహక్కులు హిందూ మైనార్టీ వర్గాలకివ్వటం లేదు.
1947లో భారతదేశం విభజింపబడినప్పుడు, పాకిస్తాన్‌లో హిందువుల జనాభా 24%. అది యిప్పుడు 1% కూడా లేదు. అలాగే బంగ్లాదేశ్‌గా పిలువబడే తూర్పు పాకిస్థాన్ హిందువుల జనాభా 30% ఉంటే, నేడు 7%. ఈ తగ్గిన హిందువులు ఏమయ్యారు. హిందువులకు మానవ హక్కులు ఉన్నవో లేదో తెలియకుండా ఉంది. దీనికి పూర్తి విరుద్ధంగా భారతదేశంలో 1951 జనాభా లెక్కలలో 10.4% ఉన్న ముస్లిం జనాభా యిప్పుడు 14%కి పెరిగారు. 1941లో 87.2% ఉన్న హిందువులు 1991నాటికి 85% మాత్రమే. విద్యాలయాలలో సంస్కృతం మత తత్వం- ఉర్దూ లౌకికవాదంగా చలామణీ అవుతున్నది. క్రైస్తవ, ముస్లిం పాఠశాలల్లో బైబిల్, ఖురాన్‌లు యధేచ్ఛగా బోధించవచ్చును. హిందువులకు భగవద్గీత, రామాయణం బోధించరాదు. హాజ్ యాత్రికులకు జెరూసలెం యాత్రికులకు సబ్సిడీలు యిస్తున్నారు. హిందూ యాత్రాస్థలాలు, అమరనాథ్, శబరిమలై, కైలాసనాథ్, మానస సరోవరాలకు వెళ్ళే యాత్రికులపై పన్ను విధిస్తున్నారు. హిందూ పుణ్యక్షేతాల, తీర్థాలకు రవాణా సదుపాయం అంటూ మామూలు ధరలకంటే 1/2% నుండి 2% అధిక రుసుం వసూలుచేస్తున్నారు. అబ్దుల్ రహమాన్ ఆంతులే ముంబైలోని, సిద్ధివినాయక దేవాలయానికి ధర్మకర్తలైతే, హిందువైన ములాయం, లాలూగాని ఒక మసీదుకుకాని మదరసాకి గాని, చర్చిలకు కాని ధర్మకర్తలు కాలేరే.్భరతదేశంలో ముస్లిం అధ్యక్షుడు, హిందూ ప్రధాని, క్రైస్తవ రక్షణ మంత్రి సమైక్యభావంతో దేశాన్ని పరిపాలించగలిగారు. ఇలాంటిది హిందూ దేశం భారత్‌లోనే సంభవం. మరోచోట కాదు. మెజార్టీవర్గాన్ని త్రొక్కి, మైనార్టీవర్గాన్ని నెత్తికెక్కించుకునే పద్ధతి మారాలి. కాలానుగుణ్యమైన దేశ పరిస్థితులకు సరిపడే మనకనుకూలమైన రాజ్యాంగ రచన జరగాలి. భారతదేశంలో వివక్షత నిర్మూలన కావాలి.

- యన్వీవి సత్యనారాయణమూర్తి