సబ్ ఫీచర్

ముదిరిపోతున్న ఇంగ్లీషు పిచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికావాలని కోరుతుంది. వివిధ అర్జీలు తెలుగులో వ్రాస్తే వాటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ప్రకటించింది. తెలుగును అధికార భాషగా చేయడానికి అధికార భాషా సంఘాన్ని నియమించింది. పరిపాలన విషయంలో వీలైనంతవరకు తెలుగు ప్రవేశపెట్టాలని సన్నాహాలు చేస్తున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పాఠశాలల్లో తెలుగు భాష ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. మాతృభాషలో ప్రావీణ్యం లేని పిల్లలకు ఇంగ్లీషు మీడియమ్‌లో బోధన ఏమిటి? అది కూడా ఒకటవ తరగతి నుండి ప్రారంభమా? పాఠశాలలో ఇంగ్లీష్ మీడియమ్‌ను ప్రైవేటు సంస్థలు ప్రారంభించాయి. ప్రభుత్వం దీన్ని నిషేధించలేకపోయింది. పోటీ తట్టుకునేందుకు ప్రభు త్వం కూడా ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలు ప్రారంభించింది.
కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియమ్ కొన్ని ఉన్నత పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియమ్ కొన్నిటిలో రెండూ సమాంతరంగా సాగుతున్నాయి. ఇదేం పద్ధతి? పిల్లలకు మాతృభాష ద్వారానే విద్య నేర్పితే మంచిదని ఇంగ్లీషువారు భావించి అలా చేస్తూ ఇంగ్లీషును ఒక భాషగా నేర్పారు. కళాశాల స్థాయినుండి ఇంగ్లీషు మీడియమ్ ఉండేది. ఇంగ్లీషు మీడియమ్ అంటే తరగతి గదిలో పిల్లలు ఉపాధ్యాయులు ఇంగ్లీషులోనే సంభాషించాలి. ఒకటవ తరగతిలో ఇది ఎలా సాధ్యం? ఇందుకు ఏవైనా గొప్ప బోధనా పద్ధతులు ఉపయోగిస్తారు కాబోలు. అందువలన ఆ పిల్లలకు ఇంగ్లీషు ధారాళంగా వస్తుందని భావించాలి. ఇంగ్లీషు మీడియమ్‌లో లెక్కలు నేర్పడం ఎలా? కూడిక తీసివేత గుణకారం ఎక్కాలు పదు ల స్థానం వందల స్థానం వంటి పదాలకి ఇంగ్లీషు వాడాలి. ఇవి ఎలా అవగాహన అవుతాయి. అందుకు కూడా ఏవైనా ప్రత్యేక బోధనా పద్ధతులున్నాయి కాబోలు. ఈ పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు ఇంటర్మీడియెట్ నుండి ఇంగ్లీషు మీడియమ్‌లో చదివినవారై ఉండాలి. బిఇడిలో ఆంగ్ల భాషా బోధనా పద్ధతులు ఒక సబ్జెక్ట్‌గా చదివినవారై ఉండాలి. బిఇడిలో ఇంగ్లీషు మోడల్ లెసెన్సు టీచింగ్ ప్రాక్టీస్ ఆరునుండి పదవ తరగతి వరకు ప్రవేశపెట్టారా? తెలియదు.
గతంలో హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలల్లో సెకండరీ గ్రేడు టీచర్లు పిల్లలకు ఇంగ్లీషు చక్కగా నేర్పేవారు. దినదినాభివృద్ధి చెందుతున్న ఇంగ్లీషు వ్యామోహాన్ని ఇప్పుడు అరికట్టాలి. కామన్ విద్యావిధానం ప్రవేశపెట్టే విషయం ప్రభుత్వం ఆలోచించాలి. నాల్గవ తరగతి నుండి ఇంగ్లీషు బోధించాలి. ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించడానికి లెక్కలు, సాంఘిక శాస్త్ర ము, విజ్ఞాన శాస్తమ్రు మొదలయినవి ఇంగ్లీషులో చదవవలసిన అవసరం లేదు. ఇంగ్లీషు మీడియమ్ స్కూళ్లలో చదివే పిల్లలు ఎంతమంది ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలుగుతున్నారు? ఈ విషయం ఎవరైనా పరిశీలించారా? దానిపై ఏవైనా సర్వేలు నిర్వహించారా? అలాంటివి జరగవు. ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలకి తమ పిల్లలను పంపిస్తే చాలు. ఇంగ్లీషు బాగా వస్తుందనే భ్రమలో పడిపోయారు తల్లిదండ్రులు.
తక్కువ సెలవులు ఇంగ్లీషు మీడియమ్ అనే రెండంశాలు చూచి తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోను పాఠశాలలో తగిన వసతులు లేవని ఉపాధ్యాయుల కొర త ఉందని వివిధ కారణాలు చూపి విద్యార్థులు ఒకరోజు సమ్మె చేస్తారు. ఆ రోజు కొందరు ప్రైవేటు పాఠశాలలను కూడా మూయించి వేస్తున్నారు. ఎందుకు ఇది? ఈ సమ్మెకు ప్రభుత్వం స్పందించి పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించలేదు. అది అసంభవం. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి చాలాకాలం క్రితం ఎస్‌సిఇఆర్‌టి ప్రవేశించింది. తరువాత జిల్లా వారీగా డైట్‌లు ప్రారంభమైనాయి. ఇటీవల సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యామిషన్ వంటి ప్రాజెక్టులు వెలిశాయి. రోగికి మందులు మితిమీరిపోయి వైద్యం వికటించినట్లు వీటివల్ల ఆశించిన ఫలి తం లభించలేదు. అవినీతి పెరిగిపోయింది. విద్యాశాఖను యధాతథంగా ఉంచి, దాని పని దానిని చేయనిస్తే చాలు. ప్రమాణాలు మెరుగుపడతాయి. అది ఇప్పుడు జరిగే పనికాదు. దీనికితోడు వాచక పుస్తకాలు పలు విమర్శలకు గురవుతున్నాయి. పెద్ద తరగతులకు తెలుగు భాష పండితులే బోధించాలి. ఇప్పుడు కొన్నిచోట్ల బి.ఎ. (తెలుగు)వారు బోధిస్తున్నారు. విద్యావ్యవస్థ బాగుపడుతుందనే విశ్వాసం ప్రభు త్వం ప్రజలకి కలిగింపలేక పోతున్నది.

- వేదుల సత్యనారాయణ