సబ్ ఫీచర్

భాషా పండితుల గోడు పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా సాధిస్తే కష్టాలు, కన్నీళ్ళు తీరుతాయని ఆశిస్తున్న తెలంగాణాలోని లాంగ్వేజి పండిత్ కాలేజీలకు, లాంగ్వేజి పండిట్ కోర్సు చదివిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వంచూపిస్తున్నది. అన్ని ఉపాధ్యాయ కోర్సులు బిఇడి/ డిఈడి కోర్సులకన్నా టిపిటి, హెచ్‌పిటి, యుపిటి చదివే విద్యార్థులు చాలా పేదవారు. వివిధ భాషలపై మక్కువ ప్రేమ ఉన్నవారు. ఆయా లాంగ్వేజి పండిట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొంది ఉద్యోగాలు పొందుతున్నారు.
తెలంగాణాలో 500దాకా తెలుగు పండిట్ ట్రైనింగ్ (టిపిటి), హిందీ పండిట్ ట్రైనింగ్ (హెచ్‌పిటి), ఉర్దు పండిట్ ట్రైనింగ్ (యుపిటి), ఓరియంటల్ కాలేజీలు ఉన్నాయి. రెండున్నర సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాలన చూశాక, తెలంగాణ సర్కారు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నదని లాంగ్వేజి పండిట్ విద్యార్థులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి, ఎం.ఎ. తెలుగు భాషా పండితుడు. మేధావి, వక్త కావటంతో భాషా శిక్షణ కళాశాల విద్యార్థులు, యాజమాన్యాలు లాంగ్వేజి పండిట్ శిక్షణ సంస్థలు వెతలు తీరుతాయని ఆశించారు. కానీ వాస్తవం భిన్నంగా ఉండటంతో వారు తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నారు. తెలంగాణ సర్కారు ఏర్పడిన తర్వాత ఎల్‌పిటి కోర్సుల విభాగం, ఎల్‌పిటి కాలేజీల పట్ల ఎల్‌పిటి విద్యార్థుల పట్ల ఇతర కోర్సులకన్నా చిన్నచూపు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు.
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015-16 విద్యా సంవత్సరంలో లాంగ్వేజి పండిట్ కామన్ ఎంట్రన్స్ నిర్వహించి అడ్మిషన్లు నిర్వహించారు. కాని తెలంగాణాలో ‘జీరో’ ఈయర్ చేశారు? కారణం తెలియదు. 2014- 15 విద్యా సంవత్సరం గడిచిపోయి ఇన్ని ఏళ్ళు అయినప్పటికీ లాంగ్వేజి పండిట్ కాలేజీలకు సంబంధించిన యూనివర్సిటీ లేదా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డిఎస్‌ఇ), ఈపాస్ వెబ్‌సైట్‌లో కన్ఫర్మ్ చేయలేదు. వేలాది మంది విద్యార్థులు ఎంతో కాలంనుండి ‘ఈ పాస్ వెబ్‌సైట్’ కన్‌ఫర్మ్‌కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 2015 అక్టోబర్‌లో వార్షిక పరీక్షలు పూర్తిఅయిన వారికి ఫీజురియంబర్స్‌మెంట్ ఇవ్వలేదు. అంతేకాదు 2014-15 విద్యా సంవత్సరం ముగిసి ఇంతకాలం అయినా ఫీజులు మంజూరు కాకపోవడం ధనిక రాష్ట్రం అయిన తెలంగాణకు తగునా? ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెగ్యులర్ ఎల్‌పిసెట్ నోటిఫికేషన్ వస్తుండగా, దేశంలోనే ఉత్తమ పరిపాలన అందిస్తున్న రాష్టమ్రని పెద్దలు ప్రకటిస్తున్న తెలంగాణలో ఎల్‌పిసెట్-2016 నోటిఫికేషన్ పెండింగ్‌లో పెట్టారు. అర్హతలు గల్గిన తెలుగు, హిందీ, ఉర్దూ మీడియం విద్యార్థులు ఎల్‌పిసెట్ నోటిఫికేషన్‌కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. భాష ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు. ‘శిశువుకు తల్లి పాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది’ అన్నారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్. లాంగ్వేజీ పండిట్ విద్యార్థులు, యాజమాన్యాలపై చిన్నచూపుచూడటం త్రిభాషాసూత్రాలకు గండిపెట్టడమే అవుతుంది. భాషాజ్ఞానం, సాహితీ జ్ఞానం, ఉత్తమ శిక్షణద్వారా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న లాంగ్వేజి సంస్థలను కేసిఆర్ కాపాడాలి. విద్యాసంవత్సరం ‘జీరో’ ఈయర్ కావటం బాధాకరం. రెండేళ్ళుగా 2014 బ్యాచ్ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఈపాస్ వెబ్‌సైట్‌లో కన్‌ఫర్మ్ కాకపోవటంవల్ల అటు యాజమాన్యాలు, ఇటు పండిట్ శిక్షణార్థులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. భాషపై ప్రేమతో ఉన్నవారికి అన్యాయం జరుగకుండా భాషాప్రియుడు సిఎం కేసిఆర్ స్పందించి వెతలు తీర్చాలి.

- రావుల రాజేశం