సబ్ ఫీచర్

దేశిక మహోదయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
జయంతి సందర్భంగా
నీ గళగీతికా శ్రుతివినీతమహార్థపరంపరల్ ప్రతీ
చీ గురుదేవవౌళిమణిసీమల గోమలసౌమనస్యశో
భాగురుసౌరభంబుల విభాసిలు వేళల నుల్లసిల్లె నో
యోగివరేణ్య! దేశికమహోదయ! మా హృదయరవిందముల్.
ఏ స్వారాజ్యరథంబునన్ నిలిచి యుద్ధేచ్ఛావిరక్తాత్ము డై
భాస్వద్ధన్వశరంబులన్ విడచు నా పార్థున్ స్వకర్తవ్యబో
ధస్వాంతున్ బొనరించె గృష్ణు డటు గీతార్థంబు బోధించి నీ
వా స్వాతంత్య్రపు దీక్ష నిచ్చితిని మా కాచంద్రతారార్కమున్.
భవదుపదేశవాఙ్నచయభావితభారతభారతీనవం
నవపథదర్శనం బిపు డనంతసుఖావహమై, నిరంతరం
బవితథధర్మదీపితశుభాకరమై, భవదీయమూర్తి మా
కవిరత మో మహాత్మ! హృదయావసథంబుల వెల్గు లీనెడిన్.
పూర్వాచార్యనిరుక్తవైదికసుధాంభోరాశిగంభీరిమా
సర్వజ్ఞాయితమందరామలతపస్సంవిత్‌కళాపూర్ణ! భ
ద్రార్వాచీనవటద్రుమాలఫలవిద్యాహృద్యవైశద్యకృ
త్సర్వేపల్లికులార్ణవర్షమణి! రాధాకృష్ణ్ధీన్మణీ!

- ఏల్చూరి మురళీధర రావు