సబ్ ఫీచర్

భవిష్యత్ చిత్రపటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరికొత్త భావాలతో కళకళలాడే తరగతి గది తీరు- ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’లా ఉంటుంది. ప్రతి విద్యార్థి తన ఆలోచనలతో తరగతి గదిని సమ్మేళనం చేసి ఒక కొత్త భావనలను అందిస్తూ ఉంటాడు. ఉపాధ్యాయుడు వీటన్నింటినీ ‘డాక్యుమెంట్’ చేస్తే ప్రతి సంవత్సరం ప్రతి క్లాసును ఒక ‘్భవాల ప్రపంచం’గా సృష్టించవచ్చు కదా! విద్యార్థి లోకానికి తరగతి ఒక భూమికలా ఉపయోగపడుతుంది. దీనిలో పిల్లలందరూ భాగస్వాములై తమ భావాలను వ్యక్తం చేస్తారు. అదే- తరగతి గదికి ఆ ఏడాది విద్యార్థుల కాంట్రిబ్యూషన్ అవుతుంది. దీనివల్ల విద్యార్థులలో జ్ఞానం ఎలా పెరిగింది? అది రాబోయే సమాజానికి ఏ విధమైన ప్రాతిపదిక కాగలుగుతుంది? అనే ఆసక్తి కలుగుతుంది. కొంతమందికి సెల్ఫ్ స్టడీ విషయంలో ఉపయోగపడుతుంది. నిజానికి ఇది ‘గైడ్’గా కనిపించే విద్యార్థుల ఆలోచనల సమ్మేళనం. తరగతి గదిలో తయారుచేసిన ఈ డిజైన్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఆ డిజైన్‌ను, ఆ సంవత్సరానికి సంబంధించిన తరగతి గదిని- పిల్లల మానసిక పరిణతికి చెందినదిగా చూడాలి. అదే ఆ తరగతికి ఇస్తున్న బహుమానంగా చూడాలి. దీనివల్ల పిల్లల ఆలోచనల్లో వారి ‘విజన్’ స్పష్టంగా కనపడటమే గాకుండా వారికి భవిష్యత్ ప్రేరణగా కూడా ఉంటుంది. దానిని పరిశీలిస్తే పిల్లల ఎడ్యుకేషన్ ప్రోసెస్ ఎలా జరుగుతుందో తెలుస్తుంది.
విద్యార్థుల అవగాహనా శక్తి ఒక దశాబ్ద కాలంలో ఎలాంటి మార్పులకు గురైంది? దానికి కారణాలు ఏమిటి? అది ఒక పరిశోధనా గ్రంథంగా తయారుకావొచ్చు కదా? ఈ భావాల అల్లికలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంత ఉన్నది? అదే ఉపాధ్యాయ శిక్షణ సంస్థలకు ఒక పరిశోధనా గ్రంథంగా మారవచ్చు కదా! దీనివల్ల రాబోయే విద్యార్థి నాయకత్వ లక్షణాలు, జరుగబోయే ఆవిష్కరణలకు నాంది కూడా కావొచ్చును. చాలామంది ఈ ‘తరగతి గది పిల్లల గ్రంథా’న్ని పరిపక్వం కాని జ్ఞానంగా భావించవచ్చును. కానీ, మొక్క కాలగతిలో మానుగా మారుతుంది. ఈ భావనలోనే భవిష్యత్ ఆలోచనలు పరిఢవిల్లుతాయి.
ఎప్పుడైనా మనం మన చిన్నప్పటి ఫొటో చూస్తే పాత ఆలోచనలు, జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తుకువస్తాయి. ఆనాటి చిన్నప్పటి ఆలోచనలను చూసి నవ్వుకోవచ్చును లేదా ప్రేరణ పొందవచ్చును. అందుకే తరగతి గదిని ‘జాతి భవిష్యత్తు రూపురేఖల చిత్రం’ అంటారు. ఈ పని అన్ని తరగతుల సమ్మేళనంతో ఆ స్కూలు చరిత్రను కూడా డాక్యుమెంట్ చేయవచ్చును. అన్ని స్కూళ్లలో సిలబస్ ఒకటే. కానీ- విద్యార్థుల ఆలోచనలు వేరు. తరగతి గది ఏకత్వం నుంచి భిన్నత్వం తీసుకువస్తుంది. ఒకటిగా ఉన్న ఆ సిలబస్ నుంచి విభిన్న ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి.

- చుక్కా రామయ్య