సబ్ ఫీచర్

కరిగే మంచుతో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత పదివేల ఏళ్లతో పోలిస్తే ఇటీవల ధృవాల వద్ద పెద్దపెద్ద మంచుగడ్డలు చాలా వేగంగా కరుగుతున్నాయి. దీంతో సముద్రమట్టం బాగా పెరుగుతోందని ఉపగ్రహాల సహాయంతో జరిపిన అధ్యయనం వెల్లడిస్తోంది. పర్యావరణ పరంగా భూ ఉపరితలంపై ధృవప్రాంతాలకు ప్రముఖ స్థానం ఉంది. ఏడాది పొడుగునా ఆ ప్రాంతాలలో మంచు పేరుకుపోయి ఉంటుంది. అక్కడి మంచు చెక్కుచెదరకుండా శాశ్వతంగా అలానే వుంటుందనీ శాస్తజ్ఞ్రులు గతంలో భావించేవారు. కానీ, ధృవప్రాంతాల మంచు త్వరితగతిన కరగడం భూమిపై మిగతా ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని వారు అంటున్నారు. భూ ఉపరితల వాతావరణం వేడెక్కుతోంది. దీని ప్రభావం ధృవ ప్రాంతాల్లో భూమిపై ఉన్న మంచుమీదనే కాదు, కొన్ని వందల అడుగుల కింద శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న మంచుపై కూడా పడుతోంది. భారీగా కరుగుతున్న మంచు ఒక ప్రవాహంలా సముద్రంలో కలుస్తోంది. దీంతో సముద్రమట్టం పెరిగి, సాగర జలాల ఉష్ణోగ్రతలతో మార్పులు సంభవిస్తున్నాయి. ఇది సముద్రంలోని జీవజాలం అస్థిత్వానికే ముప్పుగా పరిణమిస్తోంది.
గత 20 ఏళ్లుగా వివిధ ఉపగ్రహాలు, రాడార్లు అందించిన సమాచారం ఆధారంగా అమెరికాకి చెందిన ‘నాసా’తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జరిపిన అధ్యయనంలో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ధృవప్రాంతాల్లో మంచు కరుగుతోంది. గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలలో కరుగుతున్న మంచువల్ల మూడు రెట్లు ఎక్కువగా సముద్రమట్టం పెరుగుతోంది అని శాస్తవ్రేత్త ఆండ్రూ షెఫర్డ్ చెబుతున్నారు. ఈయన యుకెలోని లీడ్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్‌గా పనిచేస్తున్నారు. 1992 నుంచి ఇప్పటిదాకా సమద్రమట్టం 11 మిల్లీమీటర్ల ఎత్తు పెరిగింది. ఇందులో ఐదవ వంతు పెరుగుదల ధృవప్రాంతాలలోని మంచు కరగడం వల్లనే. మిగిలిన నాలుగు వంతుల పెరుగుదలకు భూపరితల ఉష్ణోగ్రత పెరిగి సముద్ర జలాలు వ్యాకోచించడమూ, చలి ప్రదేశాలలోని కొండలపైనున్న మంచు కరగడమూ కారణం.
అంటార్కిటికాతో పోలిస్తే గ్రీన్‌లాండ్‌లోని మంచు పదోవంతు మాత్రమే. ఇక్కడ కరుగుతున్న మంచు వల్లనే సముద్రమట్టం భారీగా పెరుగుతోంది. అంటార్కిటికాతో పోలిస్తే గ్రీన్‌లాండ్ భూమధ్యరేఖకు సమీపంలో వుండడమే దీనికి కారణమని ఆండ్రూ షెఫర్డ్ అంటారు. 1990లతో పోలిస్తే ఇటీవల ఐదు రెట్లు ఎక్కువగా మంచు కరుగుతోందని ‘నాసా’ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎరిక్ ఇవిన్స్ అంటున్నారు. అంటర్కిటికాలో పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. శాస్తవ్రేత్తలు అంటార్కిటికాను తూర్పు, పశ్చిమ భాగాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ రెండింటి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులలో చాలా వ్యత్యాసం వుంది. పశ్చిమ అంటార్కిటికాలో మంచు చాలా వేగంగా కరుగుతోంది. తూర్పు అంటార్కిటికాలోని చాలా భాగం మంచు సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ భూ ఉష్ణోగ్రతలు పెరిగినా ఇక్కడి మంచు అంత త్వరగా కరిగే అవకాశం లేదని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ‘వాతావరణ మార్పులపై గత 20 ఏళ్ళుగా చేస్తున్న అధ్యయనం సరిపోదు. పర్యావరణానికి సంబంధించి దీర్ఘకాలిక అధ్యయనంపై మన దృష్టి పెట్టాలి’ అని చెబుతున్నారు యూనివర్సీటీ ఆఫ్ వాషింగ్టన్‌కి చెందిన ఐయాన్ జొగ్లిన్.

-డి.రాజకిశోర్