సబ్ ఫీచర్

‘డిటెన్షన్’ పద్ధతే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యావ్యవస్థలో ‘నాన్ డిటెన్షన్’ విధానం ప్రవేశపెట్టారు. అన్ని తరగతులకూ పరీక్షలను ఎత్తివేస్తే విమర్శలు వస్తాయని ఏడవ తరగతికి, పదవ తరగతికి మాత్రం పబ్లిక్ పరీక్షలు ఉంచారు. కొంతకాలానికి ఏడవ తరగతికి కూడా రద్దుచేశారు. టెన్త్‌కు తప్ప మిగతా తరగతులకు డిటెన్షన్ పద్ధతి రద్దు కావడంతో గత నలభై ఏళ్లుగా విద్యాప్రమాణాలు దారుణంగా దిగజారిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పైనే పడింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి పదవ తరగతి వరకు ఏమీ చదవక పోయినా ఫర్వాలేదన్న భావన బలపడింది. పదో తరగతికి చేరుకున్న విద్యార్థుల్లో చాలామంది కనీసం తెలుగులో నాలుగు వాక్యాలు తప్పులు లేకుండా రాయలేని దుస్థితి నెలకొంది. ఇందుకు కారణం నాన్ డిటెన్షన్ విధానమే.
ఒకప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించేవారు. పైతరగతిలోకి వెళ్లే అర్హత లేనివారు అదే తరగతిలో మరో ఏడాది ఉండేవారు. ఇటీవల డిటెన్షన్ విధానంపై జరిగిన సదస్సులో ఇరవై మూడు రాష్ట్రాల ప్రతినిధులు పాత పద్ధతినే కొనసాగించాలని కోరుకున్నారు. ఐదు రాష్ట్రాలు మాత్రం నాన్ డిటెన్షన్ విధానం ఉండాలని పేర్కొన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయి. నాన్ డిటెన్షన్‌తో విద్యా ప్రమాణాలు దిగజారిన విషయాన్ని ఈ రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తించక పోవడం ఆశ్చర్యకరం. ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఆయా పాఠశాలలే ప్రశ్నాపత్రాలు తయారుచేసి పరీక్షలు నిర్వహించి పైతరగతిలోకి వెళ్లేందుకు ‘అర్హత’లను నిర్ణయించాలి. ఐదు, ఎనిమిది తరగతులకు అర్హత పరీక్షలుండే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని ప్రయత్నిస్తోంది. క్రమంగా ఈ విధానం అన్ని తరగతులకూ వర్తింపజేయాలి.
డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకించేవారు- ‘అర్హత లేకున్నా విద్యార్థులను పైతరగతులకు పంపడం ఏమిటి?’ అనే విషయాన్ని ఆలోచించాలి. విద్యా ప్రమాణాల గురించి ఆలోచించేవారెవరైనా డిటెన్షన్ పద్ధతి ఉండాలనే కోరుకుంటారు. కార్పొరేట్ స్కూళ్లపై తల్లిదండ్రుల్లో మోజు పెరగడంతో డిటెన్షన్ గురించి వారు అంతగా ఆలోచించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే డిటెన్షన్ పద్ధతిని విధిగా అమలు చేయాలి. ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవస్థ ఆవిర్భవించాక విద్యాశాఖ ఉనికిని కోల్పోయింది. విద్యాశాఖలో పాత పద్ధతులకు మంగళం పలికారు. పరీక్షల విధానం మరింతగా బలపడి డిటెన్షన్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. అప్పుడు విద్యా ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు, మార్కులు, ర్యాంకుల వ్యవస్థ ఉన్నపుడు విద్యార్థుల్లో సామర్ధ్యం పెరగాలి. పైతరగతులకు వెళ్లాలంటే అర్హత కలిగి ఉండాలి. ఆ అర్హతను నిర్ణయించేలా అన్ని తరగతుల్లోనూ డిటెన్షన్ పద్ధతి అత్యంత అవసరం.

- వేదుల సత్యనారాయణ