సబ్ ఫీచర్

స్ఫూర్తిదాతలు టీచర్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుకతో ఎవరూ గొప్ప ఉపాధ్యాయులు కారు. స్వయంకృషి, పట్టుదల, మడమతిప్పని ప్ర యత్నం ఉంటేనే ఉపాధ్యాయ వృత్తికి బలం చేకూరుతుంది. గొప్ప ఉపాధ్యాయుడు కావాలంటే మొదట ఉపాధ్యాయుడు అంకితభావం కలిగిన విద్యార్థి కావాలి. నాకు ఈ విషయం గోపాలకృష్ణ అనే భద్రాచలం ఉపాధ్యాయుడితో మాట్లాడిన తర్వాత తెలిసింది. అతనితో సీతాకోక చిలుకల గురించి మాట్లాడటం, వాటిని పరిశీలించే అలవాటు మొదలు కావడం మొదటి మెట్టు. ఈ విధంగా ఎక్కడైనా కానీ సీతాకోక చిలుకలపై ఉపన్యాసం ఉందంటే వెళ్లటం జరిగేది. ఈ క్రమంలో అతను ‘బటర్ ఫ్లై సొసైటీ’ అధ్యక్షుడు ప్రొఫెసర్ శేష్‌కుమార్‌ను కలిశాడు. వారి నుంచి కొన్ని విశేషాలు తెలుసుకున్నాడు.
ఒకరోజు జనవిజ్ఞాన వేదిక కార్యకర్త టి.బాలు వరంగల్ జూపార్క్ వద్ద ‘బటర్ ఫ్లై పార్క్’ను నిర్వహిస్తున్నాడని తెలిసి పిల్లలతో అక్కడికి బయలుదేరాం. ఆ పార్క్‌ను చూడటం గోపాలకృష్ణకు మొదటి అనుభవం. పలురకాల సీతాకోక చిలుకలు గుంపులుగా వచ్చి కొన్ని రకాల మొక్కలపై వాలుతున్నాయని అతను ఆసక్తిగా చూశాడు. అక్కడి మొక్కల పేర్లను శాస్ర్తియ నామాలతో రాసుకున్నాడు. సీతాకోక చిలుకల ఫొటోలన్నీ తీసుకున్నాడు. దీంతో అతనిలో అవగాహన మరింత పెరిగింది. ఈ చిత్రాలను తీసుకువచ్చి తన విద్యార్థులకు చూపించి ఎక్కడైనా ఇలాంటి మొక్కలు కనపడితే వాటిని తీసుకురండనీ ఆ పిల్లలలో ఉత్సాహం రగిలించాడు. తాను కూడా వెతకడం మొదలుపెట్టాడు. ఆ మొక్కల విత్తనాలు సేకరించగలిగాడు. ఆ తర్వాత మరింత సమాచారం కోసం వెతుకుతూ ఈసాక్ కమీకర్ రాసిన ‘ఇండియన్ బటర్ ఫ్లై’ అనే పుస్తకం ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకున్నాడు.
తన పాఠశాలలో సీతాకోక చిలుకల పార్క్‌ను నెలకొల్పాలని, బటర్ ఫ్లై పార్క్‌లను చూసి రావాలని కేరళకు బయలుదేరాడు, సీతాకోకచిలుకలపై పుస్తకం రాసిన ఈసాక్ కేమీకర్‌ను కలిశాడు. ఒక టీచర్ ఏ విధంగా ఒక విద్యార్థిగా మారిపోయాడో గోపాలకృష్ణతో మాట్లాడిన తర్వాత తెలిసింది. ఉపాధ్యాయుడు కావటం ఒక ఎత్తయితే, వృత్తిపట్ల దీక్ష వహంచి పనిచేయటం మరొక ఎత్తు. ఇలాంటి ప్రయత్నాలే అతడిని ఒక శిల్పంలా చెక్కుతుంది. ఒక పాఠం ఆ ఉపాధ్యాయునిలో ఎంత మార్పు తీసుకువచ్చిందో గుర్తించగలిగాను. అందుకే గోపాలకృష్ణను ఒక స్ఫూర్తిదాతగా చెప్పుకోవాలి. ఇలాంటి పనులు చేసి ఎందరెందరో గొప్ప టీచర్లయ్యారు. ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వ స్కూళ్లలో పల్లె ప్రాంతాలలో పనిచేస్తున్నారు. ఇలాంటి టీచర్లను ప్రచారంలోకి తెచ్చి ఆదర్శంగా చూపించగలిగితే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఎంతో నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వ స్కూళ్లకు టీచర్లే నిర్మాతలు.

- చుక్కా రామయ్య