సబ్ ఫీచర్

మూగజీవాలపై పరిశోధనలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కటి ఆరోగ్యంతో జీవితం గడపాలని మనిషి కోరుకుంటాడు. ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలని భావిస్తాడు. ఒకవేళ వ్యాధిబారిన పడితే ఏ మందులు వాడాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటి నివారణకు ఔషధాలను కనిపెట్టడం, అవి ఎలా పనిచేస్తున్నాయో, దుష్ఫలితాలపై ప్రయోగాలు చేయడం వైద్యఆరోగ్యఔషధ రంగాలలో మామూలే. కొత్త ఔషధాల పనితీరు, వాటికి ప్రాణులు స్పందిస్తున్న తీరు, నివారణ ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు మొదట కొన్ని మూగజీవాలపై ప్రయోగాలు చేస్తారు. దశాబ్దాలుగా ఇది సాగుతూనే ఉంది. కానీ ఇటువంటి ప్రయోగాలు జరిపినప్పుడు మూగజీవాలు ఎంతో బాధకు గురవుతాయని, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతాయని వాదిస్తూ ప్రయోగశాలల్లో మూగజీవాలపై పరిశోధనలు నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు. వాటిపై ప్రయోగాలు జరపరాదంటూ ఉద్యమిస్తున్నారు. ది నేషనల్ యాంటి వివిసెక్షన్ సొసైటీ (ఎన్‌ఎవిఎస్) ఆధ్వర్యంలో 1979 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 24న ‘వరల్డ్ లేబరేటరీ యానిమల్ డే’ను పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూగజీవాలపై పరిశోధనలు, ప్రయోగాలకు వ్యతిరేకంగా వీరు చర్చాగోష్టులు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా దీనిని గుర్తించింది. అయితే ‘యుఎన్ అబ్జర్వెనె్సస్’ జాబితాలో దీనిని చేర్చలేదు.
ప్రపంచం మొత్తం మీద వివిధ వ్యాధులు, వాటి నివారణకు ఉద్దేశించిన పరిశోధనలకోసం ఏటా 12 కోట్ల మూగజీవాలను వినియోగిస్తున్నారు. ఒక్క ఐరోపాలోనే కోటి మూగజీవాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. కేవలం లండన్‌లో 40 జంతువులను పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారు. కుందేళ్లు, ఎలుకలు, చుంచులు వీటిలో ఎక్కువగా ఉంటాయి. లుకేమియా వ్యాధి నివారణ ఔషధాల కోసం చేస్తున్న పరిశోధనల ప్రయోగాలకోసం ఏటా 2 లక్షల 30 వేల ఎలుకలను వినియోగిస్తున్నారు. మధుమేహ నియంత్రణ ఔషధాల తయారీ కోసం ఏటా కోటి జీవులను వినియోగిస్తున్నారు. మనిషి మెదడులో కణుతుల నివారణకు సంబంధించిన ప్రయోగాలలో భాగంగా ఆ కణితి కణాలను ఎలుకల మెదడులోకి చొప్పించి ఫలితాలను పరిశీలిస్తున్నారు. ఇలా చేయడాన్ని కొన్ని సంస్థలు, జంతుప్రేమికులు తప్పుబడుతున్నారు. అందులోభాగంగానే ప్రయోగశాలల్లో మూగజీవాల స్వేచ్ఛకోసం ఉద్యమిస్తున్నారు. వరల్డ్ యానిమల్ డేగా ఏప్రిల్ 24ను ఎంపిక చేశారు. ఎన్‌ఎవిఎస్ సంస్థ మాజీ అధ్యక్షుడు హగ్ డౌడింగ్ జన్మదినంనాడు దీనిని పాటిస్తున్నారు. ఈ ఉద్యమానికి ఎంత మద్దతు వస్తోందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. మానవుడి సంపూర్ణ ఆరోగ్యం కోసం చేస్తున్న పరిశోధనలు జీవనయానంలో సాధారణమని వివిధ ప్రయోగాలలో పాలుపంచుకుంటున్న శాస్తవ్రేత్తలు, పలు ఫార్మా సంస్థలు, ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. మూగజీవాలపై ప్రయోగాలకు మద్దతుగా వీరుకూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో జంతువులపై పరిశోధనలను విస్మరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నారు. మానవ మృతదేహాలలో భాగాలను కొన్ని పరిశోధనలకు వినియోగిస్తున్నారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన మానవ మూలకణాలపై మరికొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తంమీద ప్రయోగశాలల్లో జంతువులపై పరిశోధనలు మునుముందు కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-కృష్ణతేజ