సబ్ ఫీచర్

అంతరిస్తున్న జీవజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటార్కిటికా ఖండం అతి శీతల ప్రదేశం. బలమైన గాలులు, పొడి వాతావరణం ఇక్కడ ఉంటుంది. మంచు ఎడారిలాంటి ఇక్కడ ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉంటుంది. రాత్రి కాలంలో సముద్రం ఘనీభవించి పరిధి విస్తరిస్తూ ఈ ఖండం వైశాల్యం పెరుగుతుంది. ఆరు నెలల పగటి కాలంలో అదంతా కరుగుతూ వైశాల్యం తగ్గుతూంటుంది. ఇదొక ఆవృతంలా ప్రతి ఏటా కొనసాగుతుంది. ఈ పరిస్థితులే పెంగ్విన్స్, సీల్ వంటి ప్రధాన జీవజాలం మనుగడకు భూమిక. ఇందులో చిన్నపాటి మార్పు వచ్చినా వాటి మనుగడపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వాటి అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది.
అంటార్కిటికాలో ప్రధాన ప్రాణులు ఎంపరర్ పెంగ్విన్స్. తరువాత స్థానం వెడ్డెల్ సీల్స్. ‘సముద్ర జలాలు ఘనీభవించి ఉండడం పెంగ్విన్స్ సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం. ఈ సమయంలోనే సముద్రపు పీతలు పెద్ద సంఖ్యలో లభ్యవౌతాయి. కాబట్టి పెంగ్విన్స్ ఆహారానికి ఎలాంటి కొరత ఉండదు. సముద్రం ఎప్పుడైతే ఘనీభవించడం మొదలౌతుందో అప్పుడు ఎక్కడెక్కడినుంచో వేల సంఖ్యలో పెంగ్విన్స్ ఆ ప్రాంతానికి వచ్చి చేరతాయి. ఘనీభవించిన సముద్రం తిరిగి కరగడం మొదలైప్పుడు అవి ఆ ప్రదేశాన్ని వదలి వెళ్లిపోతాయి. కేవలం సంతానోత్పత్తి కోసమే పెంగ్విన్స్ సముద్రం ఘనీభవించిన ప్రదేశాలకి వస్తాయి’ అని స్ట్ఫినీ జేనోవీర్ అంటారు. ఈమె వుడ్స్ హోల్ ఒషనోగ్రఫిక్ ఇన్‌స్టిట్యూట్‌లో బయాలజిస్టు. ఒకవేళ అంటార్కిటికాలో చాలా ముందుగానే మంచు కరిగిపోతే పెంగ్విన్స్ పెట్టిన పిల్లలు ఎదగక ముందే చచ్చిపోతాయి. మంచు కరగడం ఆలస్యమైనా, నినాదంగా జరిగినా ఆ పిల్లలని వేరే చోటికి తీసుకువెళ్ళి వాటికి సకాలంలో ఆహారం అందించే ఏర్పాటు జరగక అవి చచ్చిపోతాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐ.పి.సి.సి.) అధ్యయనంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికా వద్ద పెద్దపెద్ద మంచు ఫలకాలు కరగడంలో వేగం పెరిగిందని వెల్లడయ్యింది. ఇది ఇలాగే కొనసాగితే మరో వందేళ్లలోనే ఇక్కడున్న పెంగ్విన్స్ అంతరించిపోతాయి.
యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బరీలో బయాలజిస్ట్‌గా పనిచేస్తున్న రేజీనా ఈసెర్ట్ అంటార్కిటికాలోని సీల్, వేల్ చేపల గురించి అధ్యయనం చేస్తున్నారు. ‘దక్షిణ ధృవ ప్రాంతాల వేసవికాలంలో సముద్ర అలల తాకిడికి బీటలు వారిన మంచు ఫలకాల వద్ద ఇవి గుమిగూడుతాయి. వీటిలో మగవి సముద్రం అడుగున ఉండి వింత శబ్దాలు చేస్తూ ఆడవాటిని ఆకర్షించాలని చూస్తాయి. వెడ్డెల్ సీల్స్ ప్రత్యేకత ఏమిటంటే అవి పెద్ద పెద్ద మంచు గడ్డల క్రింద గాలి మాత్రం పీల్చుకుంటూ ఎంతకాలమైనా ఉండగలవు. మంచు ఫలకాలకు పడిన బీటలు, కన్నాలు లోపల ఉన్న వీటికి గాలి పీల్చుకునే అవకాశాన్ని కలిగిస్తాయి. వీటి ద్వారా అవి ఆహార సేకరణకు బయటికి వస్తాయి. సకాలంలో ఏర్పడిన ఘనీభవించిన సముద్రపు నీరు సీల్ చేపలు పెట్టిన పిల్లలు సురక్షితంగా ఎదగడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ‘గత కొద్ది దశాబ్దాలుగా అంటార్కిటికాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వాటి మనుగడకు ముప్పు కలిగిస్తున్నాయి.

-డి.రాజకిశోర్