ఫోకస్

సంస్కరణలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టుల్లో అసంఖ్యాకంగా కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

వాటిలో కొన్ని కేసులు దశాబ్దాలుగా ఉంటున్నాయి.

పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని

న్యాయమూర్తుల నియమాకాన్ని వెంటనే చేయాలి. కొత్త

నియమకాలను ఎవరు చేయాలన్నది ఇక్కడ ప్రశ్న కాదు.

ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు

చూసుకుంటుంది. కానీ అందుకు అనుగుణంగా చర్యలు

తీసుకునే బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది.

అటువంటి చర్యలేవీ కేంద్రం ఇంత వరకుచేపట్టినట్లు

కనిపించడం లేదు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో

సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు

ఆర్థికపరమైన సమస్యలేమైనా ఉంటే వాటిని

ఎదుర్కొవడానికి మార్గం అనే్వషించాలి. పరిపాలనా

సంస్కరణల్లో భాగంగా ఇ-సేవా, మీ-సేవ, డిజిటల్, ఆన్‌లైన్

వంటివి వచ్చాయి. ఒక వ్యక్తి తనకు అవసరమైన సర్ట్ఫికేట్

కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగకుండా మీ-సేవ

ద్వారా పొందవచ్చు. తద్వారా ఆ వ్యక్తి తన సమయాన్ని

వృధా చేసుకుని, శ్రమించి ఆఫీసుల చుట్టూ తిరగకుండా

తన నివాసానికి సమీపంలో ఉన్న మీ-సేవ కేంద్రం నుంచి

పొందుతున్నారు. అదేవిధంగా జ్యుడిషీయరీలో కూడా ఇంకా

మెరుగైన సంస్కరణలు వచ్చినట్లయితే వివిధ కేసుల్లో

కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి ఉపశమనం

లభిస్తుంది. ఇక ఎన్నికల అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై

విచారణ సంవత్సరాల తరబడి జరిగి, చివరకు ఆ ఎన్నికైన

వ్యక్తి పూర్తికాలం ముగిసిన తర్వాత తీర్పు వచ్చిన

దాఖలాలు ఉన్నాయి. దీనివల్ల ప్రయోజనం ఉండదు.

సకాలంలో తీర్పు వస్తే బాగుంటుంది. అప్పుడే

తదనుగుణంగా తదుపరి చర్య తీసుకోవడానికి

వీలుంటుంది. వీటిపై అన్ని కోణాల్లో ఆలోచన చేసిన ప్రధాన

న్యాయమూర్తి ప్రధాని ఎదుట తన ఆవేదనను వ్యక్తం

చేశారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే కార్యాచరణ

ప్రణాళికను చేపట్టి కేసులు ఎదుర్కొంటున్న వారికి మేలు

చేయాలి.

- కె.ఆర్. సురేష్ రెడ్డి అసెంబ్లీ మాజీ స్పీకర్