ఫోకస్

యూనివర్శిటీ హోదా తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిమాండ్‌ను బట్టి ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతివ్వాలి. యూనివర్శిటీల ఏర్పాటులో విధివిధానాలు ప్రకటించకుండానే యూనివర్శిటీల అనుమతులపై కసరత్తు చేయడం మంచిది కాదు. నాణ్యతలేని విద్యాబోధన, సౌకర్యాలు లేని ప్రైవేటు కళాశాలలు ఎన్నో ఉన్నాయి. వాటి స్థానే యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి సరైంది కాదు. వంద ఎకరాల్లో యూనివర్శిటీ ఉండాలి. అలాంటి ఏ ఒక్క యూనివర్శిటీ లేదు. రకరకాల ఆకర్షణీయ ప్రకటనలతో విద్యార్థులను మోసగిస్తున్న కళాశాలలు, యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ముందుగా కళాశాలలపై నిఘా వేయాలి. విద్యార్థులకు సరైన విద్యాబోధన జరుగుతుందా, లేదా? యాజమాన్యాలు నాణ్యతగల విద్య అందిస్తున్నారా, లేదా? అనే విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. ప్రభుత్వ యూనివర్శిటీలలో సిబ్బంది కొరత, విద్యార్థుల సంఖ్య ఎంత అవసరమెంతుందో గుర్తించాలి. ప్రభుత్వ కళాశాలలు, యూనివర్శిటీలను అప్‌డేట్ చేస్తే బాగుంటుంది. డిమాండ్‌ను బట్టి ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇవ్వాలి. లేకుంటే విద్యార్థులు, ప్రభుత్వం నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రైవేటు యూనివర్శిటీల్లో ఫీజులు అధికంగా ఉంటాయి. దీంతో సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. అరకొర సౌకర్యాలున్న ప్రభుత్వ యూనివర్శిటీల్లో సామాన్యులు చదువుకోలేక, ప్రైవేటు యూనివర్శిటీల్లో అధిక ఫీజులు చెల్లించలేక ఉన్నత చదువును అర్ధాంతరంగా మానేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఉదాహరణకు కేంద్రం రద్దు చేసిన పెద్దనోట్ల నేపథ్యంలో ఉన్నవారికి రెండు కోట్లయినా దొరుకుతున్నాయి, లేనివారికి రెండు వేలు కూడా దొరకడం లేదు. కాబట్టి ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతిస్తే ఇదేవిధంగా జరుగుతుంది. కాబట్టి డిమాండ్‌ను బట్టి యూనివర్శిటీలకు అనుమతి ఇవ్వాలి. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుపై విధివిధానాలపై స్పష్టత ఇవ్వాలి.

-జి రాజారెడ్డి, లోక్‌సత్తా, ఎన్‌ఎఫ్‌సి చైర్‌పర్సన్