ఫోకస్

రాజ్యాధికారం కడుపు నింపదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాధికారం రాష్ట్రంలో పేద కాపుల కడుపును ఎంతమాత్రం నింపలేదు! కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన లక్షలాది మంది పేద కాపులు నేడు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. కాపు కులంలో జన్మించినందుకు జాతి రుణం తీర్చుకునేందుకే నేను ఉద్యమించాల్సి వచ్చింది. కాపులను బిసిలుగా మార్చి, క్రిమిలేయర్ విధానంలో పేద కాపులకు ఆర్థిక సహాయం, రుణాలను అందించాలి. బిసిలకు అన్యాయం చేయాలన్నది నా అభిమతం కాదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. నేను మరోసారి రోడ్డెక్కి, దీక్షచేసే పరిస్థితి తీసుకురావద్దని మనవి చేస్తున్నా! కాపులను బిసిలుగా గుర్తించాలన్న డిమాండ్ సుమారు 20 ఏళ్ళుగా ఉంది. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను మాత్రమే నిలుపుకోవాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేశా! మంజునాధ కమిషన్ మరో 7 నెలల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉన్నదని, అంతకంటే ముందుగానే కమీషన్ నివేదిక వచ్చేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఐదు నెలల్లోగా కమిషన్ నివేదికను కాపు జాతికి అనుకూలంగా ఇవ్వాలి. ఈ విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కమిషన్ నివేదిక అయినా ఏళ్ళ తరబడి బయటకు రాకుండా ఉండటం మనం చూస్తున్నాం. కాపులకోసం ఏర్పాటుచేసిన మంజునాధ కమిషన్ నివేదిక సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను. వచ్చే మార్చి బడ్జెట్‌లో కాపుల సంక్షేమ కార్పొరేషన్‌కు 500 కోట్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఏడాదికి వెయ్యి కోట్ల వంతున ఇకపై ప్రభుత్వం కచ్చితంగా మంజూరు చేస్తామని కూడా ప్రకటించారు. ప్రభుత్వ హామీల మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల అర్హులైన కాపులకు రుణాలు మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టాం. ఈ ప్రక్రియ తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ప్రారంభమయ్యింది. కాపు సామాజికవర్గానికి చెందిన ప్రత్యేక బృందాలు లబ్దిదారులను ఎంపిక చేసి దరఖాస్తు చేయించే పనిలో ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తాం. తుని హింసపై లోతైన అధ్యయనం జరిపిస్తామని, అమాయక కాపులపై కేసులు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంజునాధ్ కమిషన్‌లో నేను సూచించిన ఒకరిని సభ్యుడిగా చేర్చుకునేందుకు కూడా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. బిసిలకు అన్యాయం చేయాలన్నది నా అభిమతం కాదు! బిసిలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను కొనసాగిస్తూనే, కాపులకు కూడా న్యాయబద్ధంగా బిసి రిజర్వేషన్లు కల్పించాలన్నది నా విజ్ఞప్తి!

- ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి