ఫోకస్

ప్రజల నాడినిబట్టే మనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే పార్టీలో 32ఏళ్ల పాటు కొనసాగిన నేను ఇపుడు టిఆర్‌ఎస్‌లో చేరటానికి నియోజకవర్గం అభివృద్దే ప్రధాన కారణం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న తమను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు వంటి బలమైన నేత అండ ఉంటుందని భావించా, కానీ ఆయన ఆంధ్రాకు మఖాం మార్చటంతో ఆయన లోటు స్పష్టంగా కన్పించింది. రోజురోజుకి పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా, ఆగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏటికి ఎదురీదడటం మంచిది కాదని భావించి టిఆర్‌ఎస్‌లో చేరా. పైగా వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు దక్కిన మెజార్టీని గమనిస్తే తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌వైపే ఉన్నారన్న విషయం తేలిపోయింది. ప్రజాప్రతినిధులుగా గెలిపించిన ప్రజల మనోభీష్టానికి అనుకూలంగా మనం మెలుగుతూ, ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలమో ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్నా అధికార పార్టీ అండ అవసరమని గమనించి, నియోజకవర్గం అభివృద్ధికోసం, ప్రజల సంక్షేమం కోసమే పార్టీ మారటం అనివార్యమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ప్రజలకిచ్చిన వాగ్దానాలను చక్కగా నెరవేరుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కనీసం రెప్పపాటు అంతరాయం లేకుండా కరెంటును సరఫరా చేయటమే ఇందుకు నిదర్శనం. డబుల్ బెడ్ రూం, ఆసరా పథకాలు వంటివి సిఎం కెసిఆర్ ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లగలిగారు. ప్రజాప్రతినిధులకు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై నిబద్ధం ఉండాలి. పార్టీ పిరాయింపులు, రాజకీయాల్లో నిబద్ధత విషయానికొస్తే నేడు రాజకీయ దిగ్గజాలుగా చెప్పుకునే సిఎం కెసిఆర్ టిడిపి నుంచి, ఆంధ్రా సిఎం చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. వైఎస్సాఆర్ రాజశేఖర్‌రెడ్డి కూడా చివరివరకు ఒకే పార్టీలో కొనసాగిన వారేం కారు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పార్టీని స్థాపించి చివరివరకు అదే పార్టీలో కొనసాగారు. సరిగ్గా 30 ఏళ్లక్రితం 1986 దోమల్‌గూడ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచిన తనకు అనేకసార్లు పార్టీ టికెట్ ఇచ్చింది, ప్రజలు కూడా గెలిపించారు. ఇపుడు పార్టీ మారాల్సి వచ్చిందంటే తానున్న పార్టీలో ఇంకా కొనసాగితే నాపై నమ్మకం పెట్టుకున్న నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయలేననే టిఆర్‌ఎస్‌లో చేరా.

- జి. సాయన్న ఎమ్మెల్యే కంటోనె్మంట్ నియోజకవర్గం, టిఆర్‌ఎస్