ఫోకస్

‘రీకాల్’ చేయడమే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే లేదా ఎంపి లేక మరో ప్రజాప్రతినిధి ఎవరైనా నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ప్రవర్తిస్తే రీకాల్ చేసే అధికారం ఆయా నియోకవర్గాలకు చెందిన ప్రజలకు ఉంటే ఫిరాయింపులకు తేలికగా అడ్డుకట్టవేయవచ్చు. ఎన్నికైన తరువాత ప్రజలతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పార్టీలో చేరేందుకు ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఇలా ప్రజల నిర్ణయంతో సంబంధం లేకుండా పార్టీలు మారడం ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్టే. ఇలాంటి సందర్భాల్లో నియోజకవర్గ ఓటర్లకు రీకాల్ చేసే హక్కుంటే, రాజకీయ అవకాశవాదుల ఆటలు సాగవు. రాజకీయాలు వ్యాపారంగా మారటంతో ఫిరాయింపులు బాగా పెరిగిపోయాయి. తెలంగాణలో ఇపుడు జరుగుతున్నది అదేతంతు. కోట్లు పోసి గెలిచినవారు ఏదో విధంగా తమ పెట్టుబడిని వడ్డీతోసహా రాబట్టుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. అలా రాబట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేయలేమన్న భయం ఉంది. దీనిని అధికార టిఆర్‌ఎస్ బాగా వినియోగించుకుంటోంది. ఫిరాయింపుదారులు పార్టీని వదిలి వెళ్లిపోతూ, తెలుగుదేశం పార్టీ అంటే తమకు అభిమానమేనని, అయితే తమ నియోజకవర్గం అభివృద్ధికోసం పార్టీ మారటం తప్పటం లేదని ముక్తాయింపు ఇస్తున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కనే సభలో కూర్చుని, నైతికతకోసం అనర్గళంగా మాట్లాడిన తరువాత, చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఫోన్‌కాల్ రావటంతో బయటకు వెళ్లి, సభ ముగియకుండానే టిఆర్‌ఎస్‌లో టిడిపి ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి చేరటం, పార్టీ ఫిరాయింపులకు పరాకాష్టగా చెప్పాలి. ఇలాంటి ఫిరాయింపుల సంప్రదాయం అన్ని పార్టీల్లోను ఉంది. ఫిరాయింపులు కూడా ఉత్తుత్తినే జరగటం లేదు. కోట్లు చేతులు మారుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు అధికార పార్టీలు ఎరవేసి లోబరుచుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అధికార పార్టీలకు రెడీమేడ్ దుస్తుల్లా అందుబాటులో ఉంటున్నారు. దాంతో ప్రతిపక్షం లేకుండా చేసుకోవటం ద్వారా తమ ఇష్టారాజ్యంగా పాలన సాగించాలని అధికార పార్టీలు భావిస్తున్నాయి. దీనికోసం ఎంతకైనా తెగిస్తున్నాయి.

- గన్ని కృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ