ఫోకస్

అనర్హతకు అవకాశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ సభ్యుడు లేదా లెజిస్లేచర్ సభ్యుడు పార్టీ మారితే పరిస్థితి ఏమిటన్న అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీ నుండి ఎన్నికైన సభ్యుడు పార్టీ మారినా లేదా పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైనా వారి పదవికి గండం ఉంటుందా లేదా అన్నది చట్టరీత్యా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్‌లో కానీ, శాసనసభ లేదా శాసనమండలిలో కాని పార్టీ మారే సభ్యుల సంఖ్యపై ఆధారపడి చర్యలుంటాయి. తెలంగాణ శాసనసభలో టిడిపి సభ్యులు టిఆర్‌ఎస్‌లో చేరిన అంశాన్ని పరిశీలిద్దాం. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ఇందుకు సంబంధించిందే. ఈ షెడ్యూల్‌లోని ఐదవ సెక్షన్ ప్రకారం సభలో ఉండే ఏ రాజకీయ పార్టీకి చెందిన సభ్యులైనా మూడింట రెండువంతుల మంది పార్టీకి రాజీనామా చేస్తే వారిపై అనర్హత వేటు పడదు. అంటే 15 మందిలో 10 మంది.. టిడిపి సభ్యులు పార్టీ వీడి బయటకు వచ్చారు. టిడిపిలో ఐదుగురే మిగిలారు. బయటకు వచ్చిన 10 మంది సభ్యులు స్వతంత్ర గ్రూపుగా గుర్తింపు కోరినప్పటికీ లేదా ఇతర రాజకీయ పార్టీలో చేరినప్పటికీ, వారి సభ్యత్వం రద్దుకాదు. తెలంగాణ శాసనసభలో టిడిపికి 15 మంది ఉండగా, 10 మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. అంటే మూడింట రెండు వంతుల సభ్యులు టిడిపిలో చేరినట్టయింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఐదో సెక్షన్ ప్రకారం ఈ పది మంది టిడిపి సభ్యుల పదవికి ఎలాంటి ఢోకాలేదు. వీరిపై అనర్హత వేటు వేసే అవకాశం లేదు. టిడిపి నుండి ఎన్నికై, టిఆర్‌ఎస్‌లో చేరిన కొంతమంది సభ్యులను అనర్హులుగా చేయాలంటూ శాసనసభ స్పీకర్‌కు టిడిపి అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పుడు ఎలాంటి విలువ ఉండదు. వాస్తవంగా అసెంబ్లీ స్పీకర్‌కు పూర్తి అధికారాలు ఉంటాయి. అందువల్లనే చాలా కేసుల్లో సభ్యుల అర్హత, అనర్హతలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం లేదు. ఈ కారణంగానే తెలంగాణ శాసనసభ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న లేఖలపై నిర్ణయం తీసుకునే బాధ్యత ఆయనకే ఉంటుంది. టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేందుకు అవకాశం లేదు.

-ఎస్. రామచంద్రరావు మాజీ అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు