ఫోకస్

సభ్యత్వం రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలో చేరాలనుకుంటే, తొలుత తన సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి చేరితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఎన్నికైన పార్టీకి ఉన్నఫలంగా గుడ్‌బై చెప్పి తనకు నచ్చిన పార్టీలో చేరడం పూర్తిగా అనైతికం. ఇటువంటి ఫిరాయింపులను అరికట్టేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు ‘జంప్’ అవుతున్నారు. అలా చేయడం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పార్టీ ఫిరాయిస్తే తనను గెలిపిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరపరిచినట్లే అవుతుంది. ఆ పార్టీ సిద్ధాంతాలను నచ్చి, పోటీ చేసిన వ్యక్తి గుణగణాలు నచ్చి ఐదేళ్ళపాటు తమకు సేవలందించాలన్న ఉద్దేశ్యంతో ప్రజలు గెలిపిస్తే ప్రజాభీష్టానికి విరుద్ధంగా పార్టీ ఫిరాయించడం సమంజసం కాదు. పార్టీ ఫిరాయించిన వెంటనే ఆటోమెటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా పార్టీ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఫిరాయింపులు తెలుగు ప్రజలకు అవమానంగా ఉంది. సిద్ధాంతపరమైన రాజకీయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి లేదు. డబ్బు ప్రమేయం లేకుండా సామాన్యుడు పోటీచేసే రోజు రావాలి. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అనాసక్తత కనబరుస్తున్నారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ఆ విధంగా ఎన్నికల సంస్కరణలు తేవాలి.

- డాక్టర్ కె. లక్ష్మణ్ బిజెపి శాసనసభాపక్షం నేత, తెలంగాణ