ఫోకస్

చట్టాన్ని కఠినతరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మరింత కఠినతరం చేయాలి. లేనిపక్షంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యేలా ఉంది. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు జాతీయ స్థాయిలో జరిగే సభాపతుల సదస్సులో ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై సభాపతులు చర్య తీసుకున్న తర్వాత, ఈ అంశం మళ్లీ కోర్టు పరిధిలోకి వెళ్ళకుండా ఉండేలా చట్టాన్ని సవరించాలి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి వినతి పత్రం అందజేయాలనుకుంటున్నాను. చట్ట సభలకు ఎన్నికైన వారిలో కొందరు ఏదో ఒక కారణంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. వీటిని నిరోధించేందుకు పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలి. అప్పుడు ఆ కమిటీ ‘నిఘా’లా పని చేస్తుంది. తద్వారా ఫిరాయింపులను నిరోధించేందుకు అవకాశం ఉంటుంది. ఒక పార్టీ తరఫున చట్టసభకు ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలోకి ఫిరాయించడం అనేది పూర్తిగా అనైతికం. ఇది ప్రజా తీర్పును అవహేళన చేసినట్లే అవుతుంది. కాబట్టి ఫిరాయింపుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పటిష్టమైన చట్టం ఉండాలి. ఈ మేరకు అవసరమైన సవరణలు చేయాలి. సభాపతులు నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయ స్థానంలో ఛాలెంజ్ చేయడానికి వీలులేనంత పటిష్టంగా సవరణ జరగాలి. అప్పుడే న్యాయ స్థానాలకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇటువంటి సున్నితమైన అంశాలలోనే లెజిస్లేచర్-జ్యుడీషియరీ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ ప్రజల తీర్పు ప్రకారం ఆ పార్టీలోనే కొనసాగాలి. లేదంటే తమ పదవికి రాజీనామా చేసి తమకు నచ్చిన పార్టీలో చేరాలి. అప్పుడే నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ రాజకీయ విలువలు కాపాడాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే ఫిరాయింపులను ప్రోత్సహించడం బాధాకరం.

-కె.ఆర్. సురేష్ రెడ్డి మాజీ స్పీకర్, అసెంబ్లీ