ఫోకస్

వామపక్ష-తీవ్రవాద సంస్థల హస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎన్‌యులో వామపక్ష-తీవ్రవాద సంస్థలు మోహరించాయి. నిషేధించబడిన కొన్ని తీవ్రవాద సంస్థలు వామపక్ష సంస్థల పేరిట, డెమోక్రటిక్ పేరిట ఆవిర్భవించాయి. అంటే కాషాయ రంగు వస్త్రాలు ధరించిన స్వామిజీల తరహాలో వచ్చాయి. పలు విద్యార్థి విభాగాల వెనుక వామపక్ష తీవ్రవాద సంస్థలు ఉండి నడిపిస్తున్నాయి. అందుకే యాకుబ్ మెమన్, అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. లోగడ హెచ్‌సియులో రోహిత్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణం కూడా వేరే. కాషాయ రంగును చూస్తే సహించలేని రోహిత్ ఎబివిపి జెండాను చించి వేశాడు. ఇదే విషయాన్ని ఎబివిపి విద్యార్థి సునీల్ ప్రశ్నించాడు. యాకుబ్ మెమన్‌ను ఉరి తీసినప్పుడు ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం జరిగింది. ఆ రాత్రి సునీల్‌ను కొట్టేందుకు సుమారు 30 మంది విద్యార్థులు వెళ్ళారు. ఈ విషయాన్ని సునీల్ వైస్-్ఛన్సలర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విసి విచారణ చేసి ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినందుకే ఆత్మహత్య చేసుకున్నారనడం సరైంది కాదు.
సిపిఐ-ఎంఎల్, ఆర్‌ఎస్‌యు వంటి సంస్థలు ఎగుర వేసిన నల్లజెండాను దించేసి జాతీయ జెండా ఎగురవేసిన సామ జగన్మోహన్‌రెడ్డిని హత్య చేశారు. 1962లో చండ్ర రాజేశ్వర రావు ‘ఆర్‌ఎస్‌ఎస్ నిజస్వరూపం’ పేరిట రాసిన పుస్తకంలోనూ భారత దేశం వివిధ జాతుల కలియికగా పేర్కొనడం గమనార్హం.
40 ఏళ్ళ వామపక్షాల భావజాలం బలహీనపడింది. అందుకే దేశ ప్రజలు బిజెపి సిద్ధాంతాన్ని బలపరిచారు. వామపక్ష భావజాలం వారిది.. జాతీయ భావజాలం మాది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ‘ఆప్’ ముసుగులో వామపక్ష సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నారు. ఆయనకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తోడయ్యారు. ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో పోలీసు స్టేషన్ ఉన్నది. కానీ జెఎన్‌యు, హెచ్‌సియు పరిధిలో పోలీసు స్టేషన్లు ఉండరాదన్న పట్టుదల ఎందుకని ప్రశ్నిస్తున్నాను. అన్ని యూనివర్సిటీలను ఒకే విధంగా చూడాలి.

- డాక్టర్ ఎస్. ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి