ఫోకస్

విద్యా రాజకీయాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు సమాజం గురించి అవగాహన కలిగించడానికి, జ్ఞానాన్ని కలిగించేందుకు దోహద పడే విధంగా ఉండాలి. అర్థవంతమైన రాజకీయ చర్చ మంచిదే. కానీ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా పార్టీల రాజకీయాల పేరుతో విశ్వవిద్యాలయాలను పార్టీల రాజకీయ కేంద్రాలుగా మార్చడం మంచిది కాదు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ, ఈ దేశ చట్టాలకు అనుగుణంగా ఎవరే అభిప్రాయాలు కలిగి ఉన్నా ఆహ్వానించాలి. చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు. భిన్న సిద్ధాంతాలను అభిమానించవచ్చు. కానీ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఉంటే అది ముమ్మాటికీ తప్పే. దేశాన్ని నాశనం చేయాలని చూసే ఉగ్రవాదులకు ఎవరు మద్దతు పలికినా అది తప్పే. అయితే నిజంగా విశ్వవిద్యాలయాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయా? అనేది నిజాయితీగా విచారణ జరపాలి. అన్నింటికన్నా దేశం ముఖ్యం. దేశ భద్రత ముఖ్యం. దేశ ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా స్పందించాలి. అదే సమయంలో తమకు నచ్చని సిద్ధాంతాలను అభిమానిస్తున్నారని, దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారా? అని కూడా పరిశీలించాలి. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలపై రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారని, అండగా ఉంటున్నారని విద్యార్థులపై కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో విశ్వవిద్యాలయాల్లో తమకు నచ్చని వారిపై దేశ ద్రోహ ముద్ర వేస్తున్నారని, కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందని కొందరి వాదన. రెండు వర్గాలు బలంగానే తమ వాదనలు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఏది నిజమో అనేది సందేహంగానే ఉంది. మోదీ అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాలను తమ సిద్ధాంతాలకు అనుగుణంగా మారుస్తున్నారు అనేది కొందరి ఆరోపణ. మరోవైపు ప్రధాన మంత్రి తాము అధికారంలోకి రావడాన్ని సహించలేక, జీర్ణం చేసుకోలేని పక్షాలు విశ్వవిద్యాలయాలను తమ రాజకీయ కేంద్రాలుగా మార్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ వర్గం కూడా విశ్వవిద్యాలయాలను తమ రాజకీయ ప్రయోజనాలకు కేంద్రాలుగా వాడుకోవడం సరికాదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. విశ్వవిద్యాలయంలో నిజంగా ఏం జరిగింది అనే దానిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి.

- ఎర్రోళ్ల శ్రీనివాస్ టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు