ఫోకస్

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎన్‌యు సంఘటనపై మాట్లాడుతున్న బిజెపి జాతీయ నేతలు విద్యార్థులకు రాజకీయాలతో పనేంటి అని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య నాయుడు వంటి సీనియర్ నాయకులు విద్యార్థి సంఘాల్లో పనిచేసే ఈ స్థాయికి చేరారని గుర్తించాలి. ఇప్పుడు వాళ్లే విద్యార్థులకు యూనివర్శిటీల్లో రాజకీయాలేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యువత రాజకీయాల్లోకి రావాలి, ఏం జరుగుతుందో వాళ్లు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలియకపోతే వాళ్లు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు. జెఎన్‌యులో జరిగిన సంఘటనల విషయానికొస్తే విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యను అక్రమంగా ఇరికించారనే చెప్పాలి. విషయాన్ని పక్కదారి పట్టేవిధంగా జెఎన్‌యులో రాజకీయాలు చేస్తున్నారని మిగిలిన వారిని విమర్శిస్తున్నారు. అసలు రాజకీయాలు, రాద్ధాంతం చేస్తున్నది బిజెపి అని చెప్పాలి. అన్ని విశ్వవిద్యాలయాల్లో బిజెపిని, దాని అనుబంధ విద్యార్థి విభాగం ఎబివిపిని బలోపేతం చేయాలని చూస్తున్నారు. వరుసగా జరుగుతున్న విశ్వవిద్యాలయాల్లోని పరిణామాలకు ఇదే కారణంగా భావించాలి. ఇప్పుడు ఆ ఆలోచనే ఎన్‌డిఏ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. విద్యార్థులు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటామనే ఆత్మవిశ్వాసం పెరగాలి. అంతేకాని మనకెందుకులే అనే విధంగా ఉండకూడదు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల నుంచే రాజకీయ అవగాహన పెరగాలి. అప్పుడే అన్ని విషయాలపైనా పట్టు సాధించిన వారవుతారు. ఢిల్లీ జెఎన్‌యులో జరిగిన వ్యవస్థీకృత హింసను జెఎన్‌యు తట్టుకుని నిలబడింది. కానీ విద్యార్థి రోహిత్ చనిపోయిన అనంతరం జరిగిన పరిణామాలను హెచ్‌సియు తట్టుకోలేక పోయింది. ఇదంతా కావాలని సృష్టించిన హింస, విషయాన్ని పక్కదారి పట్టించే పరిణామ క్రమంగా భావించాలి. దేశభక్తి గురించి కొందరు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మాట్లాడ్డం విడ్డూరం. వీళ్ల దేశభక్తి ఏమిటో పటియాల కోర్టులో తేటతెల్లమైంది. న్యాయదేవత ముందు దాడులకు దిగడం దేశభక్తిగా చెప్పుకోవడం సిగ్గుచేటు.

- కె.నారాయణ సిపిఐ, జాతీయ కార్యదర్శి