ఫోకస్

నియంత్రణ మండలి ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరగాయలను పండించే రైతులకు లాభం రావాలి. అలాగే వినియోగదారులకు సరసమైన ధరలకే కూరగాయలు లభించాలి. దళారుల గుత్త్ధాపత్యాన్ని నియంత్రించాలి. ఈ కానె్సప్ట్‌తో ప్రతి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూరగాయల ధరల నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి. కూరగాయల ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తిదారులైన రైతులను విమర్శిస్తారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించక, కొనేవాళ్లు లేక ఉల్లి, టమోటాలను రోడ్డుపైన పారేస్తారు. రైతులు లబోదిబోమంటారు. ఆరుగాలం కష్టపడి వడ్డీకి రుణాలు తెచ్చి కూరగాయలను పండిస్తే కనీసం పెట్టిన పెట్టుబడి రాక భోరుమంటాడు. రైతుల బాధలను పట్టించుకోరు. వికారాబాద్ వద్ద ఒక రైతు ఐదు ఎకరాల్లో టమోటా వేశాడు. మరో రైతు 50 సెంట్లలో టమోటా వేశాడు. సకాలంలో చేతికి వచ్చిన టమోటా పంట చేతికి వచ్చి 50 సెంట్లలో పండించిన ఉత్పత్తిని అమ్ముకున్న రైతు బాగుపడ్డారు. అదే పది రోజులు ఆలస్యంగా టమోటా పంట చేతికి వచ్చిన రైతుకు మార్కెట్లో రేటు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు.
కూరగాయల ధరల నియంత్రణకు ముందుగా రాష్ట్ర స్థాయి వ్యవసాయ, ఉద్యానవన, మార్కెట్, రైతులతో కూడిన కమిటీ ఉండాలి. ఎన్ని ఎకరాల్లో కూరగాయల పంటలు వేయాలో నిర్ధారించాలి. రైతులు మార్కెట్లో మోసపోకుండా వారి ఉత్పత్తికి లాభం కల్పించాలి. అదే సమయంలో వినియోగదారుడికి సరసమైన ధరకే కూరగాయలు చేరాలి. దీనికి నిరంతరం పర్యవేక్షించే యంత్రాంగం ఉండాలి. రైతాంగ సంక్షేమానికి తాత్కాలిక చర్యలు పనిచేయవు. మార్కెట్లో కూరగాయల డిమాండ్, సరఫరా మధ్య లోటును గుర్తించే వ్యవస్థ ఉండాలి. మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే నిపుణులుండాలి. రైతు అనుకూల అధికార వ్యవస్థ ఉంటే తప్పనిసరిగా రైతులు లాభపడతారు. పక్క రాష్ట్రాల కూరగాయల మార్కెట్, మార్కెట్ యార్డులతో అనుసంధానం కలిగి ఉండాలి. రైతు బజార్ల విధానం మంచిది. కాని ఇవన్నీ మళ్లీ మెల్లిగా దళారుల కబంధ హస్తాల్లోకి వెళ్లాయి. కూరగాయల ధరలకు మద్దతు ధర ఉండదు. కాని రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తే రైతులు, వినియోగదారులకు లాభం కలుగుతుంది.

- ఎ నాగిరెడ్డి వైకాపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు