ఫోకస్

వస్తే లాభం.. లేకుంటే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభైయ్యేళ్లుగా హైదరాబాద్ (మోండా మార్కెట్) లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ప్రస్తుతం నా వయస్సు 55 సంవత్సరాలు. మా అమ్మ కూడా కూరగాయల వ్యాపారం చేసేది. మా పిల్లలు కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు. వాస్తవ పరిస్తితి పరిశీలిద్దాం.. టమోటా, పచ్చిమిర్చి తదితర కూరగాయల ధరలు పెరిగితే అత్యధికంగా పెరుగుతున్నాయి.. లేకుంటే తక్కువకు పడిపోతున్నాయి. నాతోపాటు ఇతర వ్యాపారులు కూరగాయలను బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి మోండా మార్కెట్‌కు తీసుకువస్తాం. రైతులు ఏ కాయగూర ఎక్కువ ఉత్పత్తి చేస్తే అది ఎక్కువ మొత్తంలో మార్కెట్లో దొరుకుతుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు టమోటా కిలో రెండు రూపాయలు, ఒక రూపాయి నడుస్తోందంటూ పత్రికల్లో వస్తోంది కాని మేము పదికిలోల టమాటా డబ్బా 80 నుండి 100 రూపాయలు పెట్టి కొంటున్నాం. వినియోగదారులకు 12 నుండి 15 రూపాయల వరకు అమ్ముతున్నాం. చాలా ఏళ్లనుండి చూస్తున్నా.. ఏ కూరగాయ ధర ఐనా ఎక్కువగా ఉంటే వెంటనే రైతులు దాన్ని విత్తుతున్నారు. రెండు నెలలు తిగకముందే ఒకే రకమైన కూరగాయలు మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి. దాంతో సదరు సరకు ధర టక్కున పడిపోతోంది.
నేను తెస్తున్న కూరగాయల్లో మిర్చి, గోబి, క్యాబేజీ, ఆలుగడ్డ, క్యాప్సికం, బఠాణి తదితరాలు ఇతర రాష్ట్రాల నుండి బోయిన్‌పల్లి మార్కెట్లోకి వస్తాయి. టమోటా, మిర్చి, వంకాయ, బెండకాయ, బీర, ఆనబకాయతోపాటు పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, గంగవాయిల్, పుదీన తదితర ఆకుకూరలు కూడా లోకల్‌గా పండిస్తున్నారు. ప్రస్తుతం టమోటా రూ.12, దొండ, బీర, క్యాప్సికం రూ.40, క్యాబేజీ ఒకటి రూ.25 అమ్ముతున్నాం. ఇతర కూరగాయలు కూడా పదిరూపాయలు ఇటు అటుగా అమ్ముతున్నాం. నా అనుభవంలో ఏ కూరగాయ ధరకూడా అత్యధికంగా అయినా, అతితక్కువ ధర కలిగి ఉన్నా ఎక్కువ రోజులు ఉండదు. పది-పదిహేను రోజుల్లో సాధారణ ధరలకు చేరతాయి. సర్కారోళ్లు రైతులకు చక్కగా సూచనలివ్వాలి. ఏ సమయంలో, ఎంత విస్తీర్ణంలో వేస్తే బాగుంటుందో సూచనలు ఇస్తే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుంది. సరైన ప్రణాళిక కుటుంబానికైనా, కాయగూరల వ్యాపారానికైనా మరో పనికైనా అవసరమే!

- కె. లక్ష్మణ్, కూరగాయల వ్యాపారి, మోండా మార్కెట్, హైదరాబాద్.