ఫోకస్

కూరగాయలు, పండ్లను ప్రభుత్వమే సాగుచేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలకు కల్తీలేని కూరగాయలతోపాటు పండ్లను ప్రభుత్వమే పండించాలని నిర్ణయించాం. ఉద్యానవన శాఖ అధ్వర్యంలో పండ్లు, కూరగాయాలను సాగు చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం 6 లక్షల 65 వేల ఎకరాలలో కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 75 లక్షల జనాభా ఉన్న ప్రజానీకానికి ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న కూరగాయలు ఏ మూలకు సరిపోవు. పైగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను కూరగాయాల సాగులో ఎక్కువగా వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు సరిపడ కూరగాయాలు రాష్ట్రం నుంచి ఉత్పత్తి కాకపోవడం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి వాటిని తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయాలను తెప్పించుకోవడం వల్ల వీటి ధరలు కూడా రోజురోజుకు పెరిగిపోయి ప్రజలకు భారంగా మారుతోంది. రాష్ట్ర జనాభాకు 67 లక్షల 83 వేల టన్నుల కూరగాయాలు అవసరం ఉండగా, ప్రస్తుతం ఇందులో సగం కూడా రాష్ట్రంలో ఉత్పత్తి కావడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు అవుతున్న కూరగాయలను మొదటి దశలలో 10 లక్షల హెక్టార్లకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూరగాయాలు మాత్రమే కాకుండా మిర్చి పౌడర్, పసుపు, అల్లం, ఎల్లిపాయల మిశ్రమాన్ని కూడా ఉద్యాన శాఖ ద్వారా ప్రజలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా 200 ఎకరాలలో మిర్చి, అల్లం, ఎల్లిపాయలను సాగు చేయాలని నిర్ణయించాం. వీటన్నింటికోసం హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం.

- పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి