ఫోకస్

రసీదు విధానాన్ని స్వాగతించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవిఎంల పని తీరుపై ఆరోపణలు చాలా ఎక్కువే వస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలామంది బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తమ పార్టీ సిపిఎం తరఫున ఎప్పటినుంచో ఇదే అంశంపై వివరణ కోరుతున్నాము. ఇప్పటికైనా ఓటర్లకు రసీదు ఇవ్వడంద్వారా తమ ఓటు నిర్దేశించిన వారికి వెళ్లిందనే భరోసా ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉంది. ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఈవిఎంల టాంపరింగ్ పెద్దఎత్తున జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు చేసింది ఓటర్లే కాదు, పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు కూడా చేశారు. తమ ఇంట్లో ఉన్న రెండు ఓట్లు కూడా తమకు పడలేదని బహిరంగంగానే చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఓటింగ్ యంత్రాల పనితీరుపై పెద్ద రాజకీయ పార్టీల తీరు కూడా అవకాశవాదంగా ఉంది. గెలిస్తే ఈవిఎంల గురించి పట్టించుకోరు, ఓడిపోతే మాత్రం టాంపరింగ్ అనీ, ఇంకేదో అంటూ ఆరోపణలు చేస్తాయి. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈవిఎంల వినియోగంపై పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. ఈవిఎంల పనితీరులో లోపం ఉందని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తయారు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఇప్పుడు అదే ఓటింగ్ యంత్రాల ద్వారా గెలిచి అధికారంలోకి రావడంతోనే అవి మంచివి అయిపోయాయి. ఓడినవాళ్లే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో అసలు ఈవిఎంల పనితీరుపై పూర్తి పారదర్శకత వెల్లడి కావాలి. వీటి ఉపయోగాలు, పనితీరు పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. తాము ఎప్పటినుంచో ఇదే విషయమై ఈసిని కోరాము. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాం. ఈవిఎంల పట్ల ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరాం. వినిపించుకోలేదు. టెక్నాలజీ వినియోగంపై సమగ్రంగా వివరాలు అందించాలి. రసీదు వల్ల కొంత పారదర్శకత వస్తుందని భావిస్తున్నాము.

- వై.వి.రావు, ఆంధ్రప్రదేశ్ సిపిఎం కార్యదర్శివర్గ సభ్యుడు