ఫోకస్

రసీదు అనేది కొంతే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవిఎంల వినియోగంపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలకు రసీదు ఇవ్వడం ద్వారా కొంతవరకు మాత్రమే పరిష్కారం ఉంటుంది. పూర్తి పారదర్శకత కనిపించినప్పుడే అన్ని అనుమానాలకు నివృత్తి కలుగుతుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఆమోదించాలి, ఆహ్వానించాలి. తరచుగా ఈవిఎంల టాంపరింగ్ అనే ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రసీదు ఇచ్చే పద్ధతి మంచిదే. కానీ ఇది పూర్తిగా సమస్యకు పరిష్కారం కాదు. ఓటరు తాను వేసిన ఓటు అనుకున్న వారికి వెళ్లి అది రికార్డు అవుతుందో లేదో అనేదే పెద్ద అనుమానం, అపోహ. ఈ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం కృషి చేయాల్సి ఉంది. ఈవిఎం అనేది ఎలక్ట్రానిక్ టెక్నాలజీపై ఆధారపడి పని చేస్తుంది. ఇలాంటి అనుమానానికి సమాధానం చెప్పాల్సిందీ, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందీ కూడా ఆ టెక్నాలజీపై పట్టున్నవాళ్లు మాత్రమే. కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకు ఈవిఎంల పనితీరును తీర్చిదిద్దాలి. ఓటింగ్ యంత్రాలను ప్రజలు చాలా సంవత్సరాల నుంచి ఆమోదిస్తున్నారు. కానీ ఓటింగ్ యంత్రాల్లో లోపాలున్నాయని, అవి సాంకేతికంగా ఇచ్చిన ప్రోగ్రామింగ్ ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి నేను ఎవరికి ఓటు వేశానో వారికే చేరుతుందా లేదా అనేది ఎన్నికల సమయంలో తరచు వస్తున్న ఆరోపణ. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆరోపణలను నిరూపించారు కూడా. అందువల్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే స్థితి తీసుకురావాలి. ఓటర్లలో వచ్చిన అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం స్పందించి రానున్న రోజుల్లో రసీదు పద్ధతిని అమలు చేయడంవల్ల కొంతవరకు ఫలితం ఉంది. దీన్ని అంతా స్వాగతించాల్సిందే. అయినప్పటికీ మరింత పారదర్శకతకోసం సాంకేతిక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో కూడా అవగాహన పెరగాలి. అప్పుడే టెక్నాలజీ వినియోగానికి సార్థకత ఉంటుంది. కేవలం రసీదు ఇవ్వడం వల్లే పోలింగ్ ప్రక్రియలో లోపాలన్నీ పోయాయని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు రసీదు ఇస్తామంటున్నారు, రానున్న రోజుల్లో ఇంకా అడ్వాన్స్‌డ్ పరిజ్ఞానంద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తే మంచిది. ఈ దిశగా ఎన్నికల సంఘం ఆలోచన చేస్తే బాగుంటుంది.

- చుక్కా రామయ్య విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ