ఫోకస్

ట్యాంపరింగ్ కాదని నిరూపించడానికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల ప్రధాన కమిషన్‌కు అవసరమైన ఇవిఎంలను తయారు చేస్తున్న ఏకైక సంస్థ మాదే. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఇటీవల వస్తున్నాయి. ట్యాంపరింగ్‌కు ఏమాత్రం ఆస్కారం లేదని నిరూపించడంతో పాటు ఓటర్లకు వారు వేసే ఓటుపై నమ్మకం కలిగించడానికి ‘వాపట్’ అనే ప్రింటర్లను రూపొందించాం. వీటిని ఇవిఎంలకు అనుసంధానం చేశాం. ఓటరు ఇవిఎంలో తమ ఓటు వినియోగించుకోగానే, వారు ఎవరికి ఓటు వేసింది, ఆ పార్టీ గుర్తుతో ప్రింట్ అయిన బొమ్మ బయటికి వస్తుంది. అది 6 సెకన్లపాటు కనిపించి, ఆ తర్వాత బాక్స్‌లో పడిపోతుంది. ఈ విధానాన్ని 2014 సాధారణ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం. ఆ తర్వాత ఐదు రాష్ట్రాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశాం. అయితే వీటిని లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 35 కేంద్రాలలో ఏర్పాటు చేశాం. ఇవిఎంలో కౌంట్ అయిన ఓట్లకు ప్రింట్ అయిన ఓట్లతో లెక్క సరిపెట్టుకోవడానికి కూడా ఈ విధానం దోహదపడుతుంది. ఇవిఎంలలో ట్యాంపరింగ్ జరగలేదని నిరూపించడానికి, అలాగే ఓటరు తాము వేసిన ఓటు సరిగానే పడిందన్న నమ్మకం కలిగించడానికి ఇవి ఉపయోగపడుతాయి.

- పొట్లూరి సుధాకర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఇసిఐఎల్