ఫోకస్

కాలం మారడం సహజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైనట్లేనని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం. బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ విజయపరంపర కొనసాగించినా, జార్ఖండ్‌లో చతికిలపడ్డారు. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి. ఇది దేశ వ్యాప్తంగా కనిపిస్తున్న వాస్తవాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ‘హవా’ ఇప్పుడు కనిపిస్తున్నా, అదే శాశ్వతంగా ఉండదు. ‘కాలం’ అనేది నాలుగు నెలలకు ఒకసారి మారుతుంటుంది. సంవత్సరం పొడుగునా ఒకే కాలం ఉండదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఒకటి, రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి జోరు మీద ఉన్నందున, అదే శాశ్వతం అనుకుంటే పొరపాటే. అసెంబ్లీకి 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి. రామారావు ‘హవా’ కొనసాగింది. ఫలితంగా ఆ పార్టీ 227 స్థానాలు కైవసం చేసుకోగా, మా కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకే పరిమితమైంది. అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 26 మంది ఎమ్మెల్యేలే గెలుపొందినా, మా పార్టీ డీలాపడలేదు. పార్టీ శ్రేణులూ నీరసించలేదు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మానుకోలేదు. మా పార్టీకి అధికారం ముఖ్యం కాదు. ప్రజా శ్రేయస్సే ముఖ్యం. అందుకే కాంగ్రెస్‌కు దేశ వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్నది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్. గెలుపు-ఓటమిలు సహజం. తాత్కాలిక ఓటమితో కృంగిపోవడం లేదు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. తెలంగాణకోసం కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు పోరాటం చేసినా అదంతా కెసిఆర్ అకౌంట్‌లో పడింది. అందుకే ఆ పార్టీ విజయం సాధించి, అధికారాన్ని చేపట్టింది. అయితే అది ఎంతో కాలం నిలవదు. త్వరలో ప్రజా విశ్వాసాన్ని కెసిఆర్ కోల్పోతారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల తెలంగాణలో నాయకత్వ లోపం ఉంది. ఉన్న 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే డజను మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ యంత్రాంగమంతా చిన్నాభిన్నమైంది. ఆ పార్టీ ఓటు బ్యాంకులో మెజారిటీ ఓట్లు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపే వస్తాయని ఆశిస్తున్నాం.

- మహ్మద్ షబ్బీర్ అలీ, ప్రతిపక్ష నేత, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్