ఫోకస్

మేమే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది. దేశ వ్యాప్తంగా చూస్తే ప్రాంతీయ పార్టీలు ఎక్కడా రెండు రాష్ట్రాల్లో అధికారంలో లేవు. ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లోనూ అదే జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అవుతుంది. తెలంగాణలో అక్కడక్కడా కొన్ని సీట్లు కైవసం చేసుకోగలిగినా, అధికారాన్ని చేపట్టేంత మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలోనూ అధికారం చేపట్టేంత ఎదిగితే మాకు అభ్యంతరం లేదు కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అధ్యక్షునిగా ఉన్నందున, తెలంగాణ ప్రజల ఆదరణకు ఆ పార్టీ నోచుకోవడం లేదు. ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రానికే పరిమితం కావాలని, ఇతర రాష్ట్రాలకు విస్తరించరాదని నేను అనడం లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను మాత్రమే వివరించాను.
ఇక తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి మా భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయం అని ఖచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మా పార్టీని రాష్ట్రంలోని నలుమూలలకూ విస్తరించి పటిష్టవంతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. భవిష్యత్తులో ఇంకా ఉధృతం చేయబోతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల దేశ ప్రజలు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. విదేశాల నుంచి ప్రధానికి ఆహ్వానాలు అందుతున్నాయి. దేశంలో అలజడులు సృష్టించి, ఆందోళనలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపరచాలని, అస్థిరపరచాలని విపక్షాలు చేస్తున్న కుట్రను ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతున్న ఈ సమయంలో రాష్ట్ర పార్టీని సరైన పంథాలో నడిపించి ప్రజాభిమానం చూరగొనాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. వచ్చే ఎన్నికల నాటికి మా పార్టీయే టిఆర్‌ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. కాంగ్రెస్ లోగడ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నది. ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి ఇక ఏమాత్రం లేదు. బిజెపికే బంగారు భవిష్యత్తు ఉంది.

- ఎన్. ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు