ఫోకస్

టిడిపిది ముగిసిన చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎలాంటి భవిష్యత్తు లేదు. ప్రాంతీయ పార్టీలు ఒక్క రాష్ట్రానికే పరిమితం అవుతాయి. అదే విధంగా టిడిపి ఆంధ్రకే పరిమితం అవుతుంది. ఎవరేమన్నా జరిగేది ఇదే. టిడిపిని తెలంగాణలో బతికించేందుకు మా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అంత విస్తృతంగా ప్రచారం చేసినా 150 డివిజన్లకు కేవలం ఒకే ఒక డివిజన్‌లో గెలవడం అంటే పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ తెలంగాణలో టిడిపి కనిపించకుండా పోతోంది. సాధారణ ఎన్నికల్లో టిడిపి తరఫున 15 మంది గెలిస్తే, పనె్నండు మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. మిగిలిన ముగ్గురిలో ఆర్ కృష్ణయ్య బిసి ఉద్యమంలో ఉన్నారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అక్కడకూడా ఇదే విధంగా జరిగింది. తెలంగాణలోనూ ఇదే జరుగుతుంది అనే మాట మొదటినుంచి వినిపించినా బతికించేందుకు మా ప్రయత్నం మేం చేశాం. విభజన జరిగిన తరువాత ప్రజల ఆలోచనల్లో బాగా మార్పు వచ్చింది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎవరిపట్ల వివక్ష చూపకుండా చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం టిఆర్‌ఎస్‌ను ఆదరించారు. అందుకే గత ఎన్నికల్లో గ్రేటర్‌లో అసలు పోటీచేయని టిఆర్‌ఎస్ ఈసారి ఏకంగా 150 డివిజన్లకు 99 డివిజన్లలో విజయం సాధించింది అంటే ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఎంత అభిమానం ఉందో అర్థం అవుతుంది. ఆ తరువాత జరిగిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తే, టిడిపికి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. టిడిపికి తెలంగాణలో ఎలాంటి భవిష్యత్తు లేదు. ప్రజలు ఆ పార్టీని ఆంధ్ర పార్టీగానే చూస్తున్నారు అందుకే ఆదరించడం లేదు.
తెలంగాణలో టిడిపి శ్రేణులు ఇప్పటికే టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇంకా ఎవరైనా ఉన్నా టిఆర్‌ఎస్‌లో చేరాలని నేను కోరుతున్నారు. నా నియోజకవర్గంలో టిడిపి శ్రేణులందరూ టిఆర్‌ఎస్‌లో చేరారు. కొత్త రాష్ట్రం కొత్త పంథాలో ముందుకు వెళుతోంది. బంగారు తెలంగాణకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఘనవిజయం సాధిస్తే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని బాబు ఎన్టీఆర్‌ను దించేశారు. అప్పుడు బాబు చేసినట్టుగానే ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలం టిఆర్‌ఎస్‌లో చేరాం. బాబు చేసిందే మేమూ అదే చేశాం. ఒకవైపు మమ్మల్ని విమర్శిస్తున్నవారు ఆంధ్రలో ఏం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలను టిడిపిలో ఎలా చేర్చుకుంటున్నారు. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయకముందే నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డిని టిడిపిలో చేర్చుకున్నారు.

- ఎర్రబెల్లి దయాకర్‌రావు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే