ఫోకస్

‘కారు’జోరు ఎల్లకాలం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బంగారు భవిష్యత్తు వస్తుంది. ఇప్పుడు వివిధ కారణాలతో పార్టీ ఫిరాయించిన వారంతా అప్పుడు బాధపడాల్సి ఉంటుంది. డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో లేదా జిహెచ్‌ఎంసి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు ఓడిపోయనంత మాత్రాన పార్టీకి భవిష్యత్తు లేదనో, ఉనికి ఉండదనో అనుకుంటే పొరపాటే అవుతుంది. తెలుగుదేశం పార్టీకి ఆటు-పోట్లు ఎదుర్కొవడం కొత్తేమీ కాదు. ఓడిపోయినంత మాత్రాన నీరసించి పోవడం లేదు. లోగడ బిజెపికి దేశ వ్యాప్తంగా రెండే లోక్‌సభ సీట్లు లభించాయి. ఆ తర్వాత అనూహ్యంగా ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ నేడు ఏ పార్టీల సహకారం లేకుండానే అధికార పీఠానెక్కింది. అయినా మిత్రపక్షాలను మంత్రివర్గంలో చేర్చుకున్నది. ఆ విషయాన్ని పక్కనపెడితే రాజకీయాల్లో గెలుపు-ఓటమిలు సహజం. 1982లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన వెంట తొలుత వచ్చింది నాదెండ్ల భాస్కరరావు ఒక్కరే. ఆ తర్వాత క్రమంగా అనేక మంది చేరారు. ఎక్కువగా యువకులు, మహిళలు, ఉన్నత విద్యావంతులు, రాజకీయాలకు కొత్త అయినవారే చేరారు. 1983లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేపట్టారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ విజయదుందుభి మ్రోగించారు. ఎన్టీఆర్ బతికున్నంత కాలం తిరుగులేదని లోకమంతా అనుకున్నారు. కానీ 1989లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అంతేకాదు స్వయాన ఎన్టీఆరే ఓడిపోయారు.
కాంగ్రెస్ కురువృద్ధ నేత, మర్రి చెన్నారెడ్డి రాజకీయ శకం ముగిసిందనుకున్న సమయంలోనే చెన్నారెడ్డి కోటి సంతకాల ఉద్యమంతో టిడిపిని ఓడించారు. మళ్లీ ఐదేళ్ళకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఊహించని విధంగా విజయం సాధించి, కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు సుమారు తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ఇక చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వివిధ పార్టీల నాయకులు, రాజనీతిజ్ఞులు అభిప్రాయపడ్డారు. కాలం కలిసి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా రాజకీయాలు మలుపులు తిరుగుతుంటాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో ఊహించలేం. ప్రజల నాడిని పసిగట్టలేం. కాబట్టి మా పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడలేదు. ‘కారు’ దూసుకెళ్ళినప్పుడు దుమ్ము లేస్తుంది, అటువైపు ఉన్న వారు కనిపించరు, కానీ క్రమేణా దుమ్ము నేలపై వాలి పోతుంది, అప్పుడు స్పష్టత వస్తుంది. ఆ విధంగానే ‘కారు’ జోరు ఎల్లకాలం ఉండదు.

- ఎ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్, టి.టిడిపి