ఫోకస్

మతం కోణంలో చూడరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయత అనేది ఎప్పుడూ ఒకరు భోధిస్తే వచ్చేది కాదు. తమకు తాముగా ఇంటి నుంచి, గ్రంధాలయాల నుంచి నేర్చుకుంటే స్వతహాగా వచ్చేది మాత్రమే. దేశ భక్తి, జాతీయత అనేది ఒకరు ప్రేరేపిస్తే వచ్చేది కాదు. నేర్పితే వచ్చేది అంతకన్నా కాదు. కానీ నేడు ప్రభుత్వాల ద్వారా జాతీయత అనేది ప్రచారంగా సాగుతోంది, తద్వారా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇదే బహుశా ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న వివాదాలకు కారణమవుతోంది. స్వతహాకి దేశభక్తి, జాతీయ భావన మనలో మనకు పుట్టుకతో వస్తుందో దానికి ఉన్నతమైన విలువ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ వివాదాలు రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ప్రతి ఇంటి నుంచి ఎవరికి వారు జాతీయ భావన కలిగి ఉండేలా మన పెద్దలు, తల్లిదండ్రుల నుంచి సంక్రమించాల్సి ఉంటుంది. మనం కూడా జాతీయత అనే భావన వ్యక్తం చేస్తే సరిపోదు. భారత్ మాతాకీ జై అనను అని పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అనడం పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. నిజాం పరిపాలనలో తెలంగాణలో తెలుగు నేర్చుకోవడం, మాట్లాడ్డం అంతా తప్పుగా పరిగణించారు. అసలు తెలుగు భాష అంటే అది ఒక బానిసల భాషగా పరిగణించారు. తెలుగు మాట్లాడే వాళ్లంటే బానిసలుగా గుర్తించ బడ్డారు. ఇక జాతీయత, దాని భావనకు అవకాశం ఎక్కడిది. ఇంగ్లీషు వాళ్లు నేర్చుకుంటే ఫర్వాలేదు, తెలుగు నేర్చుకుంటామంటే నిజాం పాలకులు బానిసలుగా చూసే సంస్కృతి ఉండేది. కాబట్టి ఆ సంస్కృతి, వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అసదుద్దీన్ ఒవైసీ అలా భారత మాతను కించపర్చేవిధంగా మాట్లాడ్డంలో నాకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. బహుశా ఎంఐఎం పార్టీ అదే పద్ధతిలో రూపుదిద్దుకుని ఒక వర్గం ప్రయోజనానికి అనుకూలంగా పని చేయడం వల్ల ఇంకా మిగిలిన వారిని బానిసలుగా చూడాలనే యోచనలో ఉండవచ్చును. ప్రజాప్రతినిధిగా తన నియోజకవ్గంలో ఉన్న అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉండాలి తప్ప, ఒకవర్గం తాలూకు ప్రయోజనాలను కాపడతామంటే ఎలా కుదురుతుంది. తాము చదువుకున్న రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక వర్గం ప్రార్ధన చేసుకుంటామంటే ప్రత్యేకంగా వసతి కల్పించారు. వందేమాతరం పాడతామంటే అది ఒక మతపరమైన అంశంగా పరిగణించి నిరాకరించారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు పరిశీలిస్తే జాతీయ భావన అనేది స్వతహా రావాలి తప్ప ఎవరో చెబితే వచ్చేది కాదు. ఇకనైనా అసదుద్దీన్ క్రమేణా మార్పు చెందుతారని ఆశిస్తున్నాను.

- చుక్కా రామయ్య మాజీ ఎమ్మెల్సీ